జ్యోతిర్లింగాల దర్శనంలో కన్నప్ప టీం!

Wednesday, January 22, 2025

మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘కన్నప్ప’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే, ఈ సినిమాను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను షురూ చేసేందుకు వారంతా సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా కన్నప్ప టీమ్ తాజాగా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి బయల్దేరారు.

ముందు వారు ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను సందర్శించారు. తమ సినిమాను ఆ మహాశివుడు ఆశీర్వదించాలని వారు ఈ సందర్భంగా కోరినట్లుగా మంచు విష్ణు తన సోషల్ మీడియా అకౌంట్‌లో చెప్పుకొచ్చాడు. ఇక తన తండ్రి డా.మోహన్ బాబు కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనానికి రావడం సంతోషంగా ఉందని మంచు విష్ణు అన్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles