అభిమానులకు షాక్‌ ఇచ్చిన కమల్‌ హాసన్‌!

Tuesday, January 21, 2025

తమిళ సూపర్ స్టార్ , దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన అభిమానులకు పెద్ద షాక్‌ న్యూస్‌ చెప్పాడు. ఇక తాను తమిళ బిగ్‌ బాస్‌ హోస్టింగ్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.  ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రియాలిటీ టీవీ షోకు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ తన అభిమానులను ఉద్దేశించి ఒక లాంగ్ నోట్‌ ని తన సోషల్‌ మీడియాఖాతాలో  షేర్ చేశాడు.

 “7 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మా ప్రయాణం నుండి నేను చిన్న విరామం తీసుకుంటున్నానని…ఈ విషయాన్ని బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మునుపటి సినిమా కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను చేయలేకపోతున్నాను అని ఆయన తెలియజేశారు. ఈ బిగ్‌ బాస్‌ షో ద్వారా మీ ఇళ్లలో మిమ్మల్ని నేరుగా కలిసే అవకాశం నాకు లభించింది.

మీరు మీ ప్రేమ, ఆప్యాయతతో నన్ను ఆదరించారు. దానికి మీకు నా కృతజ్ఞతలు. బిగ్ బాస్ తమిళ్‌ను భారతదేశంలోని అత్యుత్తమ టెలివిజన్ రియాలిటీ షోలలో ఒకటిగా మార్చడానికి మీ ఉత్సాహభరితమైన, భావోద్వేగ మద్దతుకు ఋణపడి ఉంటాను. ప్రదర్శనలో పాల్గొన్న పోటీదారులలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. విజయ్ టీవీ అద్భుతమైన బృందానికి , ఈ సంస్థను భారీ విజయాన్ని సాధించడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సీజన్‌ మరో సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles