2024 పాపులర్ ఇండియన్ మూవీగా ‘కల్కి 2898 ఎడి’

Friday, January 3, 2025

మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2024 ఎన్నో జ్ఞాపకాలను టాలీవుడ్ అభిమానులకు మిగిల్చింది. ఈ ఏడాదిలో విడుదలైన  కొన్ని సినిమాలు తెలుగు సినిమా సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పాయి.

వాటిలో యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్ట్‌ చేసిన సైఫై మైథలాజికల్ సినిమా ‘కల్కి 2898 ఎడి’  ఒకటి. డైరెక్టర్‌  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ రికార్డులను ఓ రేంజ్‌ లో తిరగరాసింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రముఖ ఫిల్మ్ రేటింగ్ సంస్థ ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాలో ‘కల్కి 2898 ఎడి’ నెంబర్ వన్ స్థానంతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక ఈ సినిమాలోని భారీ క్యాస్టింగ్ కూడా ఓ కారణం అని టాక్‌ నడుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles