వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా పనిచేసిన కాంతిరానా తాతా కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అధికార పార్టీ నాయకులతో అంటకాగుతూ, వారు చెప్పినట్టల్లా ఆడుతూ జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి పనిచేసిన కాంతీరానా ఇప్పుడు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముంబయికి చెందిన నటి కాదంబరి విషయంలో విజయవాడ పోలీసులు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా ఉంది. వైసిపి నాయకుడి వలన ఆమె వంచనకు గురైతే.. ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపి.. ఆమె కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి నిర్బంధించిన తీరు ఇప్పుడు రచ్చకెక్కింది. చంద్రబాబు ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని నటి కాదంబరి కోరుతుండడంతో కాం విచారణ ఎదుర్కోవాల్సి రావొచ్చు.
కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి నాయకుడు నటి కాదంబరితో వివాహేతర సంబంధం కొనసాగించారు. ఆమె పెళ్లి డిమాండ్ తేగానే వేధించసాగాడు. పోలీసు కేసుపెట్టి సజ్జల ను ఆశ్రయించినట్లు వార్తలు వచ్చాయి.
ప్రభుత్వం మారిన తర్వాత ఆ బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు ఇదే విషయంపై మీడియా తో మాట్లాడుతూ ఇది సిగ్గుపడాల్సిన విషయం కదా అని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ మాట్లాడుతూ ఇద్దరు ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దానిపై విచారణ చేస్తున్నాం అన్నారు. మొత్తానికి నటి కాదంబరి వివాదం కాంతిరాణా మెడకు గట్టిగానే చుట్టుకునేలా ఉంది.