త్యాగం చేసినందుకు న్యాయం జరుగుతోంది..

Wednesday, January 22, 2025

చంద్రబాబునాయుడు తన సొంత పార్టీలో త్యాగాలు చేసిన సీనియర్లకు న్యాయం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల అవకాశం రావడంతో.. ఒక్కొక్కరికీ అవకాశాలు కల్పిస్తున్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు, పేరాబత్తుల రాజశేఖర్ కు అవకాశం దక్కబోతోంది. ఆలపాటి రాజా.. తెనాలి నియోజకవర్గం వదులుకుని నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేశారు. మాజీ మంత్రి కూడా అయినప్పటికీ.. సైలెంట్ గా పార్టీ కోసం పనిచేశారు. అందుకు ఇప్పుడు ఫలితం దక్కుతోంది. ఎమ్మెల్సీ కాబోతున్నారు.

పేరాబత్తుల రాజశేఖర్.. ఎణ్నికలప్పుడు చంద్రబాబు కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలన్నీ చూశారు. ఆయన కాకినాడ రూరల్ టికెట్ కోరుకున్నారు గానీ.. జనసేనకు కేటాయించం వల్ల పంతం నానాజీ కోసం త్యాగం చేశారు. ఆయన కూడా ఇప్పుడు గోదావరి జిల్లాలనుంచి పట్టభద్ర ఎమ్మెల్సీ అవుతున్నారు.రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశంలో పలువురు సీనియర్లు త్యాగాలు చేశారు. వారందరికీ ఇప్పుడు వరుస క్రమంలో న్యాయం చేసే ప్రక్రియ జరుగుతోంది. ముందుగా సీనియర్లకు పెద్దపీట వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా కెఎస్ జవహర్, పిఠాపురం వర్మ తదితరులు కూడా ఉన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో త్యాగం చేసిన వారికి న్యాయం చేసే పర్వం మొదలైందని శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల పందేరం కూడా ఉంటుందని అనుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles