టీడీపీలోకి జోగి.. పుకార్లు ఇక కట్టిపెట్టండి!

Saturday, January 18, 2025

చంద్రబాబునాయుడు ఇంటి మీద దాడిచేసిన కేసులో కీలక నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్న  మాజీ మంత్రి జోగి రమేష్ తెలుగుదేశంలో చేరబోతున్నారనే పుకార్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. కేసుల నుంచి తప్పించుకోవడం అనే ఉద్దేశం, అలాగే తాను కేసుల్లో చిక్కుకున్న తరువాత..  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదనే అసహనం కారణంగా జోగి రమేష్ కుటుంబ సమేతంగా తెలుగుదేశంలో చేరబోతున్నారని కొన్ని వారాలుగా పుకార్లు షికారు చేస్తూ వచ్చాయి. తాజాగా గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ- ఆ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారధి, గౌతు శిరీషలతో పాటు జోగి రమేష్ కూడా పాల్గొన్న తర్వాతి పరిణామాలు ఈ పుకార్లకు శాశ్వతమైన ఫుల్ స్టాప్ పెట్టినట్టే భావించాలి. ఈ దెబ్బతో.. జోగి రమేష్ ను ఎప్పటికీ.. తెలుగుదేశం దరికి చేర్చే అవకాశం లేదని చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్లు అయింది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల కాలంలో ఆయన కళ్లలో ఆనందం చూడడం కోసం చెలరేగిన బ్యాచ్ లో జోగిరమేష్ కూడా ఉన్నారు. కేవలం ఆ కోరికతోనే ఆయన చంద్రబాబునాయుడు నివాసం మీద దాడికి తెగించారు. ఆ కేసు ఇప్పుడు విచారణ జరుగుతోంది. దాడిలో ఆయన పాత్ర గురించి పోలీసుల విచారణలో ధ్రువపడింది గానీ.. తెరవెనుక సూత్రధారులు ఎవరనేది తేలడం లేదు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ తెలుగుదేశంలో చేరుతారని, సూత్రధారుల వివరాలు కూడా బయటపెడతారని ఒక ప్రచారం సాగింది. అయితే కేసులో ఊరట పొందడం ఒక్కటే ఆయన ఉద్దేశం కాదని.. కేసులో ఇరుక్కున్న తరువాత.. వైసీపీ అధిష్ఠానం తన గురించి ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన వాపోతున్నట్టు సన్నిహితులు చెబుతూ వచ్చారు. దానితోపాటు ఆయన కుటుంబం ఇరుక్కున్న అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులనుంచి కూడా బయటపడ్డానికి ఆయన ఈ ఎత్తుగడ వేస్తున్నట్టుగా ప్రచారం జరిగింది.

అయితే గౌతు లచ్చన విగ్రహావిష్కరణలో జోగి రమేష్ తో కలిసి పాల్గొన్నందుకు మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీషకు చంద్రబాబునాయుడు బాగా అక్షింతలు వేశారు. ఆ ఇద్దరితో పార్టీ కార్యకర్తలకు సారీ కూడా చెప్పించారు. ఇంకెప్పుడూ ఇలా చేయం అని కూడా అనిపించారు. ఈ పరిణామాలు చూస్తే.. జోగి రమేష్ చేరిక కేవలం పుకారేనని.. అది ఎప్పటికీ సాధ్యం కాదని అర్థమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles