జక్కన్న-మహేష్‌ గరుడ..సినిమా కథ ఇదేనా!

Wednesday, February 19, 2025

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా ..దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వారిద్దరి సినిమా అనగానే టాలీవుడ్‌ తో పాటు అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేశ్‌ ఫ్యాన్స్‌..రాజమౌళి అభిమానులు ఎంతో సంతోషించారు. ఇన్నాళ్ళు కేవలం కొంత పరిధి మేరకు మాత్రమే పరిమితమయిన మహేశ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కి వెళుతుందని, తమ హీరో ఇక నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోతాడని ఘట్టమనేని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో మహేశ్, రాజమౌళి సినిమాపై రకరాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో రూపుదిద్దుకుంటుందని… ఇలా ఒకటేమిటి రోజుకొక న్యూస్ సినిమా గురించి వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా SSMB29 కు విజువల్ డెవలపర్‌గా పనిచేస్తున్న టీపీ విజయన్ ఇన్‌స్టా స్టోరీలో గోల్డ్‌ కలర్‌లో ఉన్న గద్ద రెక్కల ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ అయిపోయింది. దీంతో SSMB29 రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘గరుడ’ అని ఎవరికీ తోచిన విధంగా వారు కథనాలు రాసేసుకుంటున్నారు.

ఈ విషయమై రాజమౌళి టీమ్ ను సంప్రదించగా అలాంటిది ఏమి లేదని, ఆ కథ వేరు ఈ కథ వేరు అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టి పారేసారు. దీంతో ఇవన్నీ ఫేక్ న్యూస్ అని తెలిసిపోయింది. త్వరలోనే ఈ సినిమా వర్క్ షాప్ మొదలు కాబోతుందని ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు తో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఇందులో  పాల్గొనబోతున్నారని తెలుస్తుంది. డిసెంబరు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ మొదలు కానుంది.

ఈ చిత్రానికి GOLD అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ఆ అర్ధం వచ్చేలా టీపీ విజయన్ పోస్ట్ చేసాడని యూనిట్ లోని కొందరు సభ్యులు అంటున్నారు. మరి ఈ ఊహాగానాలాకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles