ప్రభుత్వ ప్రెవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీ నిర్వహణ చేపట్టాలని ఏపీ కేబినెట్ తీర్మానించిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వండివారుస్తున్న అబద్ధాలు చీదర పుట్టిస్తున్నాయి. తాను పరిశుద్దుడిని అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు సర్కారు వైద్యవిద్యా రంగానికి చేటు చేస్తున్నట్టుగా జగన్ చెబుతున్న మాటలు.. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలను ఒక్కచాన్స్ అంటూ వంచించి.. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ అయిదేళ్ల పాటు కొనసాగపించిన అపరిమితమైన విధ్వంసయజ్ఞంలో విద్యారంగం కూడా సర్వనాశనం అయింది. జగన్ ఏదో తన రికార్డులో విద్యాసంస్థలను స్థాపించినట్టుగా ఉండాలనే వెర్రితో మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. అంతే తప్ప వాటికి కనీస వసతులు కల్పించడం గానీ, కనీసం లెక్చరర్లను నియమించడం గానీ చేయనేలేదు. భవనాలను ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేయలేదు. అత్యంత అధ్వానమైన స్థితిలో జగన్ స్థాపించిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అన్నింటినీ గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా.. పీపీపీ విధానంలోకి మెడికల్ కాలేజీల నిర్వహణకు పూనుకుంటుండగా.. జగన్ ప్రెవేటీకరణ చేసేస్తున్నారంటూ జగన్ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మొసలి కన్నీరు కారుస్తున్నారు.
ఒక విడత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా చేసిన వ్యక్తికి.. పీపీసీ విధానానికి, ప్రెవేటు రంగానికి తేడా కూడా తెలియదా అంటూ.. మంత్రి సత్యకుమార్ వంటి వారు ఎద్దేవా చేస్తున్నారు. మెడికల్ కాలేజీలకు కొబ్బరి కాయ కొట్టేసి.. వాటి మానాన వాటిని వదిలేసి.. నిర్వహణ గురించి, నాణ్యమైన వైద్యవిద్య అందడం గురించి పదవీకాలం ముగిసేదాకా ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి జగన్. ఆయన ఇప్పుడు చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయం గురించి తప్పుపట్టడం.. కేవదలం ప్రజలను మాయ చేయడమే అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డికి పనిచేసినట్టుగా కనిపించాలని, తన ఖాతాలోకి కీర్తి రావాలనే కోరిక తప్ప.. విద్యాప్రమాణాలపై శ్రద్ధ లేదని చెప్పడానికి ఇదొక్కటే ఉదాహరణ కాదు. ఎందుకంటే.. కడపలోనే ఆయన తన తండ్రి వైఎస్సార్ పేరిట ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. అయితే.. దానికి అవసరమైన అనుమతులను ఢిల్లీనుంచి తీసుకురావడం గురించి నామమాత్రంగా కూడా పట్టించుకోలేదు. దీంతో.. అక్కడ జాయిన్ అయిన విద్యార్థులు ఇప్పుడు నాలుగో సంవత్సరం కూడా పూర్తవుతుండగా.. తాము చదవిన డిగ్రీకి అసలు గుర్తింపు ఉన్నదో లేదో అనే టెన్షన్ లో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఢిల్లీలోని సదరు సంస్థతో సంప్రదింపులు జరిపి వారికి అవసరమైన అనుమతులు ఇప్పించింది. జగన్ మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇదే తరహా దుర్మార్గంగా ప్రవర్తించారు.
ప్రారంభించినట్టుగా తన ఖాతాలో వేసుకుని, కనీస వసతులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ కాలేజీలను పద్ధతిగా తయారైతే.. ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందో అనే భయంతో జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆయా మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వం పరం చేస్తామని ఆయన అనడం .. కేవలం ఆ కాలేజీల్లో ఎవరూ చేరకుండా భయాందోళనలకు గురిచేసి భయపెట్టడానికి మాత్రమే అని పలువురు అనుకుంటున్నారు.
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా జగన్ మాటలు!
Thursday, December 4, 2025
