జగన్ అసలు బుద్ధిని  బయటపెట్టిన పాతతమ్ముడు!

Monday, December 23, 2024

ఇంతకూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు ఎందుకు వెళ్లడం లేదు. ఆయన చెబుతున్నట్టుగా.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఒక్కటే అందుకు కారణమా? లేదా ఇంకా ఏమైనా ఇతర ఆలోచనలు కూడా ఆయనలో ఉన్నాయా? ఈ విషయంలో ప్రజలకు రకరకాల సందేహాలు ఉన్నాయి. తనకు హోదా ఇవ్వలేదని, హోదా లేకపోవడం వల్ల ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి మైక్ ఇవ్వరని జగన్ ప్రకటించారు. అయితే.. హోదా ఇవ్వనందుకు ఆయన అలగడం వరకు ఓకే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లకుండా ఎందుకుండాలి? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం. కనీసం వారైనా సభకు వెళ్లి ప్రజాసమస్యలను ప్రస్తావించవచ్చు కదా అనే భావన ఆ ఎమ్మెల్యేల్లో కూడా ఉంది. అయితే.. జగన్ యొక్క అసలు బుద్ధిని.. గతంలో ఆయన పార్టీలోనే ఉండి పనిచేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటపెట్టారు.
శాసనసభలో తాను తప్ప.. తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవ్వరూ మాట్లాడడం ఆయనకు ఇష్టం ఉండదని కోటంరెడ్డి చెబుతున్నారు.

2014-19 మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో కూడా జగన్ అసెంబ్లీలో ఎప్పుడు చూసినా మైక్ కోసం గొడవపడేవారే తప్ప.. ప్రజా సమస్యలపై కాదని కోటంరెడ్డి అంటున్నారు. నిజానికి అప్పట్లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న తామందరితో కూడా మైక్ కోసమే గొడవ చేయించేవారని ఆయన గుర్తు చేస్తున్నారు. 2017లో శాసనసభకు డుమ్మా కొట్టేసి జగన్ పాదయాత్రకు వెళ్లారు. తాను పాదయాత్రకు వెళుతున్నప్పుడు శాసనసభలో పార్టీని నడిపించే బాధ్యతను ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికో మరో సీనియర్ నాయకుడికో అప్పగించి వెళ్తే చాలా బాగుండేదని కానీ ఆ పని చేయకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా సభకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి కట్టడి చేశారని కోటంరెడ్డి గుర్తుచేస్తున్నారు. తాను తప్ప సభలో ఎవరూ మాట్లాడడం ఇష్టం లేగనే జగన్ అలా చేశారని ఆయన అంటున్నారు.

ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. శాసనసభ సమావేశాలకు ముందు జగన్ ఒక సన్నాహక సమావేశం పెట్టుకున్నప్పుడు.. చాలా మంది ఆయన సొంత ఎమ్మెల్యేలు సభకు వెళ్లకపోతే బాగుండదని సూచించారు. సభకు వెళ్లకపోతే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని సలహా ఇచ్చారు. జగన్ రాకపోయినా సరే.. తామైనా సభకు వెళ్లేలా అనుమతించాలని కూడా అడిగారు. అయితే జగన్ మాత్రం.. మొత్తం పార్టీ తరఫున ఎవ్వరూ సభకు వెళ్లకుండా చేసి తన అసలు బుద్ధిని చాటుకున్నారని ఇప్పుడు ప్రజలకు అనిపిస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles