పలావ్ కు బిర్యానీ కి తేడా ఏమిటి అని అడిగితే చాలామంది వెంటనే చెప్పలేరు. కొందరికి అసలు తెలియదు. అలాంటి వారు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని సంప్రదించడం బెటర్. ఎందుకంటే పలావ్ కు బిర్యానీ కి తేడా ఆయనకు బాగా తెలిసినట్టు ఉంది. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ జగన్ ఈ మాటలు అంటున్నారు.
జగన్ ఇప్పటికీ తన ఓటమిని జీర్ణించుకోవడం లేదు. ఆ దశ దాటి వచ్చి పార్టీ ప్రజాదరణ పెంచే ప్రయత్నాల్లో పడడం లేదు. ఆయన మాట్లాడుతూ తను రాష్ట్ర ప్రజలకు పలావ్ పెట్టానని, చంద్రబాబు నాయుడు బిర్యానీ ఆశ చూపి అధికారంలోకి వచ్చారని అంటున్నారు. ఆయన బిర్యానీ పెట్టలేదు సరికదా.. పలావ్ కూడా పోయిందని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డికి అర్థం కానీ సంగతి ఒకటుంది. ఆకలేస్తున్న పేదవాడికి పెట్టడానికి పలావ్ కోసం వెతకడం అర్థం లేని పని. వారికి ముందు పట్టెడన్నం పెడితే చాలు. అన్న కాంటీన్లను రద్దు చేసేసి.. పేదవాడి నోటికాడ కూడు లాగేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయినవాళ్ళకు మాత్రం పలావ్ పెట్టడానికి జగన్ తాపత్రయ పడ్డారు. చంద్రబాబు బిర్యానీ ఆశ చూపించలేదు.
ఆ పట్టెడన్నం గురించే చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15న పేదోడికి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించనున్నారు. పేదవాడి ఆకలి కష్టాలు తెలియని జగన్ కు palav- బిర్యానీ కథలు చెప్పే అర్హత లేదని ప్రజలు అంటున్నారు.
అమ్మఒడి, రైతు భరోసా వంటి వాటి గురించి ఇప్పుడు గోల చేసి లాభం లేదని.. చంద్రబాబు కాస్త కుదురుకోగానే అన్నీ అమలవుతాయని ప్రజలు అంటున్నారు.