వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేశారు. ఆ సమయంలో కూడా రాష్ట్రంలో అనేక విపత్తులు వచ్చాయి, ప్రమాదాలు జరిగాయి. ఏనాడూ ముఖ్యమంత్రిగా ఆయన తక్షణం స్పందించి.. ప్రమాదతీవ్రత ఉన్న ప్రాంతాలకు వెళ్లి.. దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించినది లేదు. వరదలు ముంచెత్తినప్పుడు కూడా ఆయన హెలికాప్టర్ లలో పర్యటిస్తూ గడిపారే తప్ప.. ప్రజల కన్నీళ్లను స్వయంగా తుడిచే ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు.. నేను ముఖ్యమంత్రిని.. నేరుగా విపత్తు ప్రాంతాలకు, ప్రమాద స్థలాలకు వెళ్లడం వల్ల అక్కడి సహాయక కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుంది అంటూ బుకాయింపు వచనాలు చెబుతూ వచ్చారు. హెలికాప్టర్ లో తిరిగి చూడడానికి కూడా విపత్తు తర్వాత.. అంతా ఉపశమించిన తర్వాత.. మూడు నాలుగు రోజులకు బయల్దేరే వారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. సింహాచలం దేవస్థానం వద్ద ప్రమాదం జరిగితే.. హుటాహుటిన అప్పటికప్పుడు బయల్దేరి ఎందుకు వెళ్లిపోయారు. దానికి అసలు కారణం ఏంటంటే.. ఆయన అర్జంటుగా బెంగుళూరు బయల్దేరి వెళ్లిపోవాలి. ప్రతివారం బెంగుళూరు యలహంక ప్యాలెస్ కు వెళ్లి ఏం కార్యకలాపాలు వెలగబెడుతుంటారో గానీ.. ఆ బెంగుళూరు షెడ్యూలు సింహాచలం మృతుల వల్ల డిస్ట్రబ్ కాకుండా.. జగన్ తక్షణం అక్కడ వాలిపోయారు. మొసలి కన్నీరు కార్చారు.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల పంపిణీ సమయంలో కూడా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. అప్పుడు కూడా జగన్ అక్కడకు వెళ్లారు. పరామర్శలనే ప్రహసనం నడిపించారు. కానీ ఒక్కరోజు ఆగి అక్కడకు వెళ్లారు. సింహాచలం విషయంలో ఆ మాత్రం కూడా ఆగలేకపోయారు. ఆగితే మళ్లీ తన యలహంక యాత్ర ఆలస్యం అవుతుందని, అక్కడి రహస్య షెడ్యూళ్లు తారుమారు అవుతాయని కంగారు పడ్డట్టున్నారు. వెంటనే సింహాచలం వెళ్లిపోయారు.
అసలింతకూ అంత అర్జంటుగా తాడేపల్లి వదలి ఎందుకు పారిపోవాలనుకున్నారు? దానికి కూడా ఒక కారణం ఉంది. అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. అంగరంగ వైభవంగా ఆ కార్యక్రమానికి సన్నాహాలు జరగబోతున్నాయి. రాష్ట్రంలో కనీ వినీ ఎరుగనంత ఘనంగా.. ఆ శుభకార్యం జరగబోతోంది. అంతటి శుభకార్యం జరుగుతోంటే చూసి తట్టుకోగలిగే సహృదయం జగన్ కు లేదు! తన చుట్టూ ఉండే ప్రజలు పండగ చేసుకుంటూ ఆనందంగా గడుపుతోంటే తన కళ్లతో చూడలేరు గనుకనే.. ఆయన బెంగుళూరు వెళ్లిపోయారని.. అది ముందే ఖరారైన పర్యటన గనుక.. సింహాచలం కంటి తుడుపు పర్యటనను దుర్ఘఘటన జరిగిన గంటల వ్యవధిలోనే పెట్టుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్.. అంత అర్జంటుగా ఎందుకు వెళ్లారంటే..?
Monday, December 8, 2025
