జగన్ మోహన్ రెడ్డి అక్రమార్జనలు, అవినీతికి పాల్పడిన అనేక కేసుల్లో ఏ1 నిందితుడు. రాజకీయంగా ఆయన ప్రత్యర్థులు అనేక సందర్భాల్లో జగన్ గురించి ప్రస్తావించల్సి వచ్చినప్పుడు.. ఏ1 నిందితుడు అనే పదం మాత్రమే వాడేవారు. జగన్ ఏ1 కాగా, విజసా యిరెడ్డి ఏ2 అనేది అందరికీ తెలుసు. పార్టీలో, అయిదేళ్లపాటు ప్రభుత్వంలో కూడా వీరిద్దరే నెంబర్ వన్, టూలుగా చక్రం తిప్పారు. అయితే.. తనను హేళన చేసిన ప్రతి ఒక్కరినీ ‘ఏ1’ అనే ముద్రతో పిలవాలని జగన్ కు పెద్ద కోరిక. అందుకే ఆయన తనకు ప్రజలు అధికారం ఇస్తే.. దానిని రాజకీయ ప్రత్యర్థుల మీద.. తనను ఏ1 అనిన వారిమీద పగ తీర్చుకోవడానికి వాడుకున్నారు.
కొల్లు రవీంద్ర, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ధూళిపాళ నరేంద్ర ఇలా అనేక మంది నాయకులమీద ఆయన తన ప్రభుత్వ కాలంలో కేసులు బనాయించి.. ఏ1లుగా వారిని పెట్టారు. చంద్రబాబు మీద ఏ కేసులూ పెట్టడానికి ఆయనకు వీలుకాలేదు. చివరికి పాలనలో చివరి సంవత్సరంలో రకరకాల దొంగ సాకులు చూపించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏ1 చేశారు. కానీ.. అరెస్టు తర్వాత.. రాజమండ్రి జైల్లో అయితే పెట్టగగారు గానీ.. కేసుకు సంబంధించిన.. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలను సంపాదించడంలో ప్రభుత్వం విఫలమైంది. జగన్ కుట్ర బెడిసికొట్టింది. చంద్రబాబునాయుడుకు బెయిలు వచ్చింది. ఆయన బయటకు వచ్చాక.. జగన్ దుర్మార్గాల మీద విరుచుకుపడి ప్రజల్లో అవగాహన తీసుకువచ్చి.. ఓడించిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుపై జగన్ చేసిన కుట్ర ఎటూ ఫెయిలైంది. ఆయనకు బెయిలు వచ్చిన తర్వాత.. దానిని రద్దు చేయాల్సిందిగా.. జగన్ తన మనుషులతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయించారు.అయితే ఆ బెయిలు రద్దు చేయించాలని కూడా జగన్ కలగన్నారు. బెయిలు రద్దు కోసం సుప్రీం కో ర్టులో ప్రభుత్వం తరఫున పిటిషన్ వేయించారు. అలాగే.. తన తొత్తులతో కూడా బెయిలు రద్దు కోసం పిల్ లు వేయించారు. చంద్రబాబు బెయిలు రద్దవుతుందని కలగన్నారు. ఆ కల కూడా ఇప్పుడు విఫలమైంది.
తాజాగా ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. పాపం జగన్ కల కూడా తీరకుండాపోయింది.
నిజానికి జగన్ తాను చంద్రబాబును జైల్లో పెట్టానని ఆనందించారేమో తెలియదు గానీ.. ఆ జైలు రోజులే.. రాష్ట్ర రాజకీయాల్ని మార్చేశాయి. పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్లి.. బయటకు రాగానే.. పొత్తులను అప్పటికప్పుడు ప్రకటించడం ఒక సంచలనం. ఆ రకంగా చంద్రబాబు మీద కుట్ర ద్వారా.. తన పతనానికి జగన్ తానే బీజం వేనుకున్నారని ప్రజలంతా అనుకున్నారు.