లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టు అయిన 12 మంది నిందితులలో ఏ ఒక్కరిని కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా జైలుకు వెళ్లి ములాఖత్‌లో పరామర్శించలేదు. లిక్కరు కుంభకోణం మీద సిట్ ను ఏర్పాటు చేసి సీరియస్ గా దర్యాప్తు ప్రారంభించిన తొలినాటి నుంచి కూడా.. జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన దళాలు అసలు ఈ స్కాం అనేదే లేదని లేని స్కాం గురించి అభూత కల్పనలను జోడించి రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటున్నారని అనేక రకాల విమర్శలు చేశారు. చేస్తున్నారు. ఆ వాదనకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నట్లుగా అరెస్టు అయిన ఏ ఒక్కరినీ సమర్థించే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. మురాఖత్ రూపంలో వెళ్లి వారిని కలవడానికి ప్రయత్నించలేదు. కాకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వారు కూడా రిమాండ్ లో జైలుకు వెళ్లిన తర్వాత జగన్ మాట తీరు కొద్దిగా మారింది. మా పార్టీ మీద కక్షతో అమాయకులను తీసుకువెళ్లి జైల్లో పెడుతున్నారు.. అంటూ, వారు చాలా మంచి వాళ్ళు అని కితాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ములాఖత్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్ళబోతున్నారు. 25న అక్కడి జైలులో రిమాండ్ లో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆయన పరామర్శిస్తారు. ఈ విషయాన్ని వైసిపి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
కాగా ఇంచుమించుగా 42 మంది నిందితులు ఇప్పటికే రికార్డు అయి ఉన్న మద్యం కుంభకోణంలో ఇప్పటిదాకా నిందితులను కలిసేంత బహిరంగంగా స్పందించని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మాత్రం పెద్దిరెడ్డి మిత్రులు రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు అనేది సామాన్యులకు అర్థం కాని మిలియన్ డాలర్ ప్రశ్న.
ఈ పర్యటన వెనుక అసలు అంతరార్థం కేవలం పరామర్శ మాత్రమే కాదని, అంతకుమించి మద్యం కుంభకోణం విషయంలో మిథున్ రెడ్డితో చర్చించవలసిన రహస్యాలు అనేకం ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రహస్యాలు అంటే మూడో వ్యక్తికి కూడా తెలియకూడని విషయాలు మాత్రమే గనుక స్వయంగా తానే వెళ్లి మిథున్ రెడ్డిని కలవడానికి జగన్ సిద్ధపడినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి నితిన్ రెడ్డిని కాస్త ప్రిపేర్ చేయడానికి జగన్ తనకు విశ్వసనీయులైన మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి లను రెండు రోజుల కిందట మిథున్ వద్దకు పంపారు. ఆ తర్వాతనే మిథున్ రెడ్డి ని కలవడం కోసం జగన్ జైలు అధికారుల సమయం నుంచి తీసుకోవడం జరిగింది. 25న ఈ ఇద్దరు నాయకులు రహస్యాలు మాట్లాడుకోవడానికి జరుగుతున్న భేటీలో మద్యం కుంభకోణం సొమ్ములకు సంబంధించి అనేక వాస్తవాలు చర్చకు వస్తాయని.. మిథున్ రెడ్డి నుంచి తాను తెలుసుకోవలసిన అనేక సంగతులను తేల్చుకోవడానికి మాత్రమే జగన్ వస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
