వల్లభనేని అరెస్టు వ్యవహారంలో అతిగా స్పందించడం ద్వారా.. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మైలేజీ కోరుకుంటున్నారో అర్థం కాని సంగతి. ఎందుకంటే.. ఇదేమీ పార్టీ జస్ట్ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికేసులో అరెస్టు కాదు. అసలు కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులోనే ఇప్పటిదాకా అసలు నిందితులైన నాయకుల్ని ఎవరినీ అరెస్టు చేయలేదు. కేవలం విచారించారంతే. కానీ.. వంశీని అరెస్టు చేశారంటే.. అది దాడి కేసు కాదు. ఎస్సీ యువకుడి కిడ్నాపు, నిర్బంధం కు సంబంధించిన కేసు. కిడ్నాపు చేసి వంశీ ఒక వాంగ్మూలం ఇప్పిస్తే.. వంశీ చెరనుంచి బయటకు వచ్చిన తర్వాత.. అతను న్యాయమూర్తి ఎదుట మరో వాంగ్మూలం కూడా ఇచ్చాడు. ఈలోగా వంశీ రిమాండులో ఉన్నాడు. జగన్ పరామర్శించి.. ఇలా విమర్శలతో నిందలతో రెచ్చిపోవడం జరుగుతోంది.
అయితే జగన్ ఇక్కడ ఒక రాజకీయ కుయుక్తిని ప్రదర్శిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వంశీ అరెస్టు ను హైలైట్ చేయడం, వంశీ కోసం తపన పడుతున్నట్టుగా కనిపించడం ద్వారా… కమ్మ సామాజిక వర్గానికి తాను దగ్గర కాగలనని జగన్ నమ్ముతున్నట్టుంది. అలాగే.. వంశీ, కొడాలి నాని లను ద్వేషిస్తున్నారని అంటూ.. కమ్మ వర్గాన్ని తెలుగుదేశానికి, చంద్రబాబుకు దూరం చేయడానికి కూడా తపన పడుతున్నట్టుగా ఉంది. తన సొంత కులమే అయినప్పటికీ.. రాజకీయంగా ఎదుగుతున్న వారిని చంద్రబాబు టార్గెట్ చేస్తుంటారంటూ.. జగన్ వింత భాష్యాలు చెప్పారు. తనకంటె వంశీ, కొడాలి నాని అందంగా ఉంటారు గనుక..
చంద్రబాబునాయుడుకు కడుపుమంట అని జగన్ అనడం విలేకర్లకు కూడా వింతగా అనిపించింది.
కానీ ఆయన కుయుక్తులు పారే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే.. తమను ఎమ్మెల్యేలు చేసిన చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి జగన్ పంచన చేరినప్పుడే.. కొడాలి నాని, వంశీలను కమ్మ వారు అసహ్యించుకున్నారు. చంద్రబాబునాయుడు భార్య గురించి అసహ్యకరమై వ్యాఖ్యలు చేసిన సమయంలో.. వల్లభనేని వంశీ అనే వాడు కమ్మ జాతిలో పుట్టినందుకు.. ఆ కులానికి చెందిన వారందరూ బాధపడ్డారు. చీదరించుకున్నారు. అలాంటిది ఇవాళ వంశీ సామాజికవర్గాన్ని తెరపైకి తెచ్చి.. చంద్రబాబునాయుడు కమ్మవాళ్లను ద్వేషిస్తున్నారనే విషప్రచారం చేయడానికి జగన్ ప్రయత్నించడం అసహ్యకరమైన కుయుక్తిగా ప్రజలు భావిస్తున్నారు.
అసలు కిడ్నాపు, నిర్బంధం అరెస్టుకు సంబంధించిన గొడవలు నడుస్తోంటే.. వంశీ అందంగురించి, కొడాలి నాని అందం గురించి జగన్ మాట్లాడడం చిత్రమైన విషయం. జగన్ తన పాలనకాలంలో.. తన సొంత పార్టీలో తొక్కేసిన వారినందరినీ.. వారి అందం చూసి తొక్కేసేవారేమో.. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. చంద్రబాబునాయుడు గురించి కూడా అలాంటి విషం చిమ్ముతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్.. తలాతోకా లేని కుయుక్తి మాటలు..!
Wednesday, April 2, 2025
