రోము నగరం తగలబడిపోతూ ఉంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ గడిపాడనేది సామెత. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి కూడా అంతకంటె భిన్నంగా ఏమీ కనిపించడం లేదు. ఒకవైపు అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల ముడుపులు స్వయంగా జగన్ తీసుకున్నట్టుగా అమెరికాలోనే కేసులు నమోదైన వ్యవహారం మొత్తం దేశాన్నే కుదిపేస్తుండగా.. జగన్ మాత్రం ఎంచక్కా.. రాష్ట్ర ప్రభుత్వం మీద ట్వీట్లు పెట్టుకుంటూ కాలం గడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ చేయడం లేదని, అందువల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని కూలి పనులకు వెళ్లాల్సి వస్తున్నదని జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
విద్యార్థులకు ఫీజు రీఇంబర్స్‌మెంట్ వ్యవహారం భ్రష్టు పట్టిపోవడానికి ప్రధాన కారకుడు జగన్ అనే అభిప్రాయం అటు విద్యార్థులు, కళాశాలల వర్గాల్లో ఏకగ్రీవంగా వ్యక్తం అవుతోంది. చెల్లింపుల్లో కాస్త ముందు వెనుకలుగా జరుగుతూ వచ్చినప్పటికీ.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నేరగా కాలేజీలకే విద్యార్థుల ఫీజు డబ్బులు అందుతుండేబి. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్రవాత.. బటన్ నొక్కుతానని, బీవోటీ విధానంలో డైరక్టుగా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లకే నిధులు ట్రాన్స్ ఫర్ చేస్తానని రకరకాల డ్రామాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో భాగంగా.. ఫీజు రీఇంబర్స్‌మెంట్ తీరును కూడా మార్చేశారు. తొలుత తల్లులు అకౌంట్లలో నేరుగా డబ్బు జమ చేసే విధానం తీసుకువచ్చారు.
దీనివల్ల వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయింది. తల్లుల ఖాతాల్లో డబ్బులు పడినా కూడా.. అవి కాలేజీలకు చేరకపోవడం, విద్యార్థులను కాలేజీకి రానివ్వకుండా గెంటేయడం వంటి దుర్మార్గాలు జరిగాయి. తర్వాత ఆయన నాలిక్కరుచుకుని తల్లి- విద్యార్థి జాయింట్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు బదిలీచేసే పద్ధతి తెచ్చారు. ఫీజులు కాలేజీలకు ఇవ్వకుండా.. వ్యక్తులకు ఇస్తే తనకు ఓటు బ్యాంకు తయారవుతుందని.. మీ ఇళ్లకు ఇన్నేసి వేలు, ఇన్నేసి లక్షలు తాను డబ్బులిచ్చినట్టుగా ప్రజలను ఎమోషనల్ బ్లాక మెయిల్ చేసి ఓట్లు వేయించుకోవడం సాధ్యముతుందని జగన్ కుట్రవ్యూహాలు అమలు చేశారు. అయితే.. తల్లి-విద్యార్థి జాయింట్ అకౌంట్ల ద్వారా చెల్లింపుల్లో కూడా అనేక ఇబ్బందులు వచ్చాయి. ఇంతా కలిపి తన పాలనలో చివరలో అసలు చెల్లింపులే చేయకుండా బటన్ నొక్కేసి దిగిపోయారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అనేక ఇతర విధానాల్లాగానే ఈ విధానం కూడా చక్కదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్‌మెంట్ లు తప్పక చెల్లిస్తుందని.. నేరుగా కాలేజీలకే చెల్లించే విధానం వస్తుందని సాక్షాత్తూ మంత్రి బాల వీరాంజనేయస్వామి శాసనసభలోనే ప్రకటించారు. అయితే.. అసలు తన చుట్టూ రేగుతున్న వివాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ ఇలా ట్వీట్లు పెట్టుకుంటూ గడుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
జగన్ : నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా..
Sunday, January 26, 2025