ప్రత్యేకహోదా డిమాండ్ తో జగన్ దళం రాజీనామా!

Saturday, September 7, 2024

టీడీపీ సర్కారు రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకురావాలని, నిర్ణీత గడువులోగా ఆ పనిచేయలేకపోతే.. ప్రజాక్షేత్రంలో తీర్పు కోరాలని అందుకు మద్దతుగా తాము రాజీనామా చేస్తాం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 11 మంది ఎంఎల్ఏ లతో సభకు వెళ్లడాన్ని చాలా అవమానంగా జగన్ భావిస్తున్నారు. సహించలేకపోతున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టడానికి సాకులు వెతుకుతున్నారు. అసెంబ్లీ తొలిరోజు రఘురామ జగన్ ను పలకరించి.. ‘ప్రతిరోజూ అసెంబ్లీకి వస్తూ ఉండు జగన్ ‘ అని వెటకారం చేయడం కూడా ఆయనకు పుండు మీద కారం రాసినట్టు అయింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హొదా అనేది అడ్డు పెట్టుకొని డ్రామా నడిపించాలని జగన్ అనుకుంటున్నారట.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకు రావాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటులో హోదా డిమాండ్ వినిపించాలని తన పార్టీ ఎంపీ లకు కూడా పురమాయించారు. ప్రత్యేక హోదా అనేది ఎప్పటికీ తేలే అంశం కాదు కాబట్టి దాన్ని పట్టుకుని ఐదేళ్లపాటు సాగదీయాలని జగన్ అనుకుంటున్నట్టు సమాచారం. ఐదేళ్లపాటు తాను అధికారంలో ఉన్నప్పుడు.. ఒక్కసారి కూడా జగన్ హోదా మాటెత్తలేదు. ఇపుడు ఆయనకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది.

గతంలో కూడా తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీ లతో రాజీనామా చేయించి, ప్రత్యేక హోదా పోరాటం అనే డ్రామా నడిపారు జగన్. ఇప్పుడు తను అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేక రాజీనామా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రాజీనామాలు ఆమోదం పొందితే.. మళ్లీ మళ్లీ ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసిపి ఎంఎల్ఏ లు, ఎంపీ లు సిద్ధమేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles