ఇప్పట్లో కష్టమే!

Wednesday, February 19, 2025

ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళిని ఆయన సన్నిహితులు ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటారనే సంగతి తెలిసిందే. ఎందుకంటే సినిమాని అంతలా చెక్కుతూ ఉంటాడు కాబట్టి. ఆయన మామూలుగానే ఓ మూవీకి 6 నుంచి 7 నెలల ప్రీ ప్రొడక్షన్ టైం తీసుకుంటాడు. రెండేళ్లు సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తుంటాడు. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వడు కాబట్టి సాధారణంగా అంత సమయం పడుతుంది.

కానీ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడంతో ఇప్పుడు ఆయన మరింతగా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుతో 29వ సినిమాని రాజమౌళి ప్రకటించాడు. ఈ సినిమా కోసం ఆరేడు నెలలు కాదని ఏకంగా సంవత్సరం ప్రీ ప్రొడక్షన్ కోసమే కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. .అందుకే ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోనే షూటింగ్ మొదలుపెట్టాలి అనుకున్నారు కానీ వచ్చే ఏడాది జనవరికి పోస్ట్‌ పోన్‌ చేసినట్లు సమాచారం.

నిజానికి వర్క్ షాప్స్ అలాగే ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి షూటింగ్ డేట్ జనవరికి మార్చినట్లుగా సమాచారం. ఇప్పటికే వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. మహేష్ బాబుతో పాటు సినిమాలో కీలకమైన వ్యక్తులు, వర్క్ షాప్స్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది.. సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే గడ్డం పెంచి బాడీని కూడా సాలిడ్ గా తయారు చేసే పనిలో ఉన్నాడు.  కానీ సెప్టెంబర్ లో మొదలవుతుంది అనుకున్న షూటింగ్ మాత్రం జనవరికి చేంజ్‌ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles