తన పరిపాలన కాలంలో ఏం ఉద్ధరించాడో ఆయనకు అక్కర్లేదు.. ఇప్పుడు ఎక్కడైనా ఒక సమస్య ఉన్నదంటే.. దానికి మూల కారణాలు ఏమిటో కూడా ఆయనకు అక్కర్లేదు.. అడ్డగోలుగా ప్రభుత్వాన్ని నిందించడానికి ఆ సందర్భాన్ని వాడుకోవడం ఒక్కటే జగన్ కోరిక. ఆ క్రమంలోనే ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో తోతాపురి మామిడి రైతులను పలకరించడానికి వెళుతున్నారు. తోతాపురి మామిడికి ధర పడిపోయిందని అనుకుంటున్న తరుణంలో వారి తరఫున పోరాడుతానని అంటున్నారు. అయితే.. తమాషా ఏంటంటే.. తోతాపురి రైతుల బాధలను జగన్ గుర్తించడానికంటె ముందే.. ప్రభుత్వం ఎన్నడో స్పందించింది. ప్రతి కిలోకు రూ.4 వంతున సబ్సిడీ ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా.. రైతులు ఎన్ని వందల టన్నులు తీసుకువచ్చినా సరే.. ప్రతి కిలోకు కూడా సబ్సిడీ ఇవ్వడానికి చంద్రబాబునాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అవేమీ జగన్ కు పట్టవు.. తన చుట్టూ కొన్ని వేల మంది కిరాయి మనుషుల్ని గుంపులుగా పోగేసుకుని, వారితో జై కొట్ట్టించుకుంటూ, సీఎం నినాదాలు చేయించుకుంటూ ఏదో ఒకఊరిలో కాసేపు హడావుడి చేసి వెళ్లిపోవడమే ఆయనకు కావాల్సింది. అయితే తోతాపురి విషయంలో క్షేత్రస్థాయిలో వేరే విధంగా ఉన్నాయి.
సాధారణంగా చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ఎక్కువగా పండిస్తారు. ఆ జిల్లాలో మామిడి పల్ప్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కువ. జ్యూస్ కోసం ఆ ఫ్యాక్టరీలన్నీ తోతాపురి రకాన్నే కొనుగోలు చేస్తాయి. అయితే ఈ ఏడాది తోతాపురికి పెద్దగా మార్కెట్ ధర లేకపోవడానికి వేర్వేరు కారణాలున్నాయి. ఒకటి గోల్డెన్ క్రాప్ అన్నట్టుగా దిగుబడి ఎక్కువగా వచ్చింది. మామూలుగా చిత్తూరు జిల్లాలో 4 లక్షల టన్నుల తోతాపురి దిగుబడి వస్తుంది. ఈసారి గోల్డెన్ క్రాప్ కింద 5.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. దిగుబడి పెరిగినందువల్ల ఆటోమేటిగ్గా ధర తగ్గుతుంది. ఈసారి రెండో ప్రమాదం ఏంటంటే.. జ్యూస్ ఫ్యాక్టరీల వద్ద రెండేళ్లుగా దాదాపు 40వేల టన్నుల మామిడి పల్ప్ మార్కెట్ లేక అలాగే మిగిలిపోయింది. దాంతో సహజంగానే.. పల్ప్ ఫ్యాక్టరీలనుంచి తోతాపురికి మార్కెట్ డిమాండ్ దారుణంగా పడిపోయింది. డిమాండ్ లేకపోవడంవల్ల రేటు తగ్గింది. అయినా సరే ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడానికి కిలోకు రూ.4 వంతు సబ్సిడీ ప్రకటించి.. ఎన్ని వందల టన్నలు తెచ్చినా సబ్సిడీ ఇస్తాం అంటోంది. అదే సమయంలో పొరుగున ఉన్న కర్ణాటకలో ఒక్కరైతుకు ఒక హెక్టారుకు అయిదు టన్నులకు మాత్రమే సబ్సిడీ వర్తించేలా ఆంక్షలు పెట్టారు. సాధారణంగా ఎకరాకు 13 టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. ఏపీలో ఎన్ని టన్నులైనా సరే సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం ఇన్ని వరాలు ప్రకటించినా సరే.. జగన్ కుటిలత్వంతో కావాలని రచ్చ చేయడానికి బంగారుపాళెం యాత్ర పెట్టుకున్నారని, రైతులపై ప్రేమ ఉన్నట్టుగా డ్రామాలు ఆడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
తోతాపురిపై జగన్ డ్రామాలు కట్టపెడితే బెటర్!
Friday, December 5, 2025
