అది అస్సలు ఊహించలేదు…అభిమానులు హర్ట్‌ అవుతారేమో!

Sunday, December 22, 2024

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణే పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్‌ తాజాగా నటిస్తున్న కల్కి సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాతో దీపికా తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరిస్తుంది. ఇ కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్న సమయంలో తెలుగులో తన ఫేవరేట్‌ హీరో వెరో బయటపెట్టింది దీపికా. ఆమెకు తెలుగులో  ఆ హీరో అంటే చాలా ఇష్టమని చెప్పిన సంగతి ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్స్, టీజర్స్‌ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్‌ చేసింది. దీపికా యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టింది. ఆమె నటనకు ఫుల్‌ మార్క్స్‌ పడ్డాయి. కాగా ఈ సినిమా ఈవెంట్‌ ను ఇటీవల ముంబైలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దీపికా తన ఫెవరెట్‌ హీరో ఎవరో బయటపెట్టింది.

ఆమెకు తెలుగులో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పేసింది.మహేష్‌ బాబుతో కూడా తాను కలిసి నటించే రోజు దగ్గర్లోనే ఉందేమో అని ఇద్దరి అభిమానులు అనుకుంటున్నారు. జక్కన్న డైరెక్షన్లో మహేష్‌ ఓ తాజా చిత్రాన్ని నటిస్తున్నాడు. దీపికా ఈ సినిమాలో మహేష్‌ తో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపికా ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అనే విషయం తెలిసిందే.

కల్కి సినిమాలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు నచ్చితే మాత్రం ఆమెకు టాలీవుడ్‌ లో వరుస అవకాశాలు రావడం పక్కా..ఈ సినిమా రేపు విడుదల కాబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles