సరైన తోడు దొరకడం కష్టమే..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా: మృణాల్‌!

Sunday, December 22, 2024

హే సీతా అంటూ తెలుగు వారి మదిలో చెరగని ముద్ర వేసుకున్న సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తరువాత చేసిన హాయ్‌ నాన్న సినిమా కూడా మంచి హిట్‌ టాక్‌ ని సొంతం చేసుకుంది. ఆ తరువాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా పెద్దగా హిట్‌ అవ్వకపోయినా…ఆమె నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ లో సంజయ్‌ లీలా  బన్సాలీ సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే  తాజాగా మృణాల్‌ ఆమె  రిలేషన్ గురించి, పిల్లలని కనడం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, నటి మృణాల్ ఠాకూర్ తన వర్క్ లైఫ్, లైఫ్ బ్యాలెన్స్, తన ఎగ్స్ స్టోర్ చేయడం గురించి మాట్లాడింది.

జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యమంటూ వివరించింది. కానీ మీరు ఎల్లప్పుడూ ఆ బ్యాలెన్స్‌ను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారని ఆమె తెలిపింది. ప్రస్తుత కాలంలో ఉన్న రిలేషన్స్‌ చాలా  కష్టమని నాకు తెలుసు, అందుకే మీ పనిని అర్థం చేసుకునే సరైన భాగస్వామి ని మీరు ఎంచుకోవాలి. అంతేకాదు నేను నా ఎగ్స్ ను స్టోర్ చేయడం గురించి కూడా ప్రణాళికలు చేస్తున్నా అంటూ మృణాల్‌ చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా మృణాల్ ‘మంచం నుండి లేవడానికి ఇష్టపడని’ రోజుల గురించి కొన్ని కామెంట్లు చేసింది. అలాంటి రోజుల్లో కూడా వెళ్లి సినిమాల కోసం కష్టపడాల్సి వచ్చిందని వివరించింది.  అలాంటి రోజులను అధిగమించడానికి తాను థెరపీ,  తన మనుషుల మీద ఆధారపడతానని ఆమె వెల్లడించింది.విభిన్న పాత్రలు పోషించే నటులకి థెరపీ అవసరం. అందుకే నేను థెరపీ తీసుకుంటా, నన్ను నా స్నేహితులు, నా సోదరి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారని వివరించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles