పింఛను దార్లను మభ్యపెట్టడానికి వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపినీ చేయడం అనేది కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వీల్లేదని ఈసీనుంచి ఆదేశాలు వచ్చాయో లేదో.. అధఇకార వైఎస్సార్ కాంగ్రెస్ భలే చాన్సుగా భావించింది. పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులను నానా ఆరళ్లు పెట్టడం ద్వారా ఆ పాపాలన్నింటికీ బాద్యుడిగా చంద్రబాబును నిందించి.. లబ్ది పొందవచ్చునని తపన పడింది. పెన్షన్ల విషయంలో లబ్ధిదారులను టెన్షన్ పెట్టి, వారిని ఎండల్లో సచివాలయాలకు రప్పించి.. పదులసంఖ్యలో ప్రాణాలు పోవడానికి ఈ ప్రభుత్వం కారణం అయింది.
అయితే ఇలాంటి కుట్రలు మే నెలలో మళ్లీ రిపీట్ కాకుండా.. ఎన్నికల సంఘం ముందే ఆదేశాలు జారీచేస్తున్నది. మే నెలలోనైనా ఇళ్ల వద్దకే పెన్షను అందేలా సీఎస్ ను ఆదేశించి తదనుగుణంగా ఏర్పాట్లు చేయాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల సంఘానికి ఇటీవల లేఖ రాశారు. తాజాగా ఈసీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు వచ్చాయి. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడానికి వీల్లేదని, ఈసీ జారీచేసిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని ఆదేశించింది.
ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు, ఉద్యోగుల ద్వారా కూడా అందజేయవచ్చునని పేర్కొన్నట్టుగా ఈసీ సూచించింది. గ్రామసచివాలయ ఉద్యోగులను పద్ధతిగా వాడుకుంటే.. ఇంటింటికీ ఎప్పటిలాగానే పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యం ఎంత మాత్రమూ కాదని చంద్రబాబునాయుడు తొలినుంచి చెబుతూనే ఉన్నారు. అసలు లబ్ధిదారులు ఎందరు? సచివాలయ ఉద్యోగులు ఎందరు? వారిద్వారా పంపిణీకి ఎంతకాలం పడుతుంది. ఎంత సులువుగా ఆ పర్వం పూర్తిచేయవచ్చు. ఇళ్లవద్దనే ఎలా ఇవ్వవచ్చు.. ఇలాంటి అన్ని రకాల గణాంకాలతో కథనాలు కూడా వచ్చాయి. అయినా ఏఫ్రిల్ నెలలో దుర్మార్గమైన రీతిలో పంపిణీ జరిగింది.
ఇప్పుడు మేనెల రావడానికి నాలుగురోజుల ముందే ఈసీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించడం విశేషం. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను నియమించుకోవాలని కూడా ఈ సీ సూచించింది. వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వాడాలనే ఆలోచనను కూడా ఈసీ స్వయంగా చెప్పడం విశేషం. ఇప్పుడిక సీఎస్ ఏం చేస్తారో చూడాలి. ఒకటోతేదీనే అందరికీ అందాలని కాకుండా.. కావాలిస్తే నాలుగురోజులు జాప్యం జరగవచ్చు గానీ.. లబ్ధిదారులు రోడ్డున పడాల్సిన అవసరం లేకుండా పంపిణీ చేయగల మార్గాలను సీఎస్ అన్వేషించాలి. అలా చేయగలిగినప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఆయన సమర్థత తెలిసి వస్తుంది తప్ప.. మరొకటి కాదని ప్రజలు అంటున్నారు.
ఇంటింటికీ ఇవ్వాల్సిందే.. చావులు ఆగాల్సిందే!
Sunday, December 22, 2024