భారీ చిత్రాలు రూపొందినప్పుడు అధికారంలో ఎవరు ఉన్నా సరే.. ఆ చిత్రాలకు కొన్ని రాయితీలు ఇవ్వడం, టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పించడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో విడుదల అయిన పవన్ కల్యాణ్ చిత్రం ‘వకీల్ సాబ్’ విషయంలో చాలా భిన్నమైన చిత్రమైన పరిణామాలు జరిగాయి. ఈ సినిమా టికెట్ ధర పెంచడానికి ప్రభుత్వం ఒప్పుకోలేదు సరికాదా.. ధర తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పైగా వకీల్ సాబ్ విడుదల చేస్తున్న సినిమా థియేటర్లను సీజ్ చేశారు. విచ్చలవిడిగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నడూ లేనంత దారుణంగా తనిఖీలు జరిగాయి. థియేటర్లు సీజ్ అయ్యాయి. వకీల్ సాబ్ సినిమా తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. అయితే మరీ అంత దారుణంగా జగన్ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సినిమా మీద ఎందుకు కక్ష కట్టినట్టు అనే అనుమానాలు అందరికీ వచ్చాయి.
పవన్ ను రాజకీయ శత్రువుగా జగన్ పరిగణించారనే సంగతి అందరికీ తెలుసు. కానీ, ఆ శత్రువు మీద రాజకీయ విజయమే సాధించాలని జగన్ ఆలోచించి ఉంటే చాలా గౌరవంగా ఉండేది. కానీ.. వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంలో జగన్ లోని ఫ్యాక్షనిస్టు ధోరణి బయటకు వచ్చిందనే విమర్శలు వచ్చాయి. శత్రువుల ఆర్థిక మూలాలను, వనరులను నాశనం చేయడం అనేది ఫ్యాక్షనిస్టుల లక్షణం. నిజానికి వకీల్ సాబ్ సినిమా టికెట్ ధరలు పెంచకపోతే.. హీరో పవన్ కు వచ్చే నష్టం లేదు. ఆ లాభ నష్టాలు నిర్మాతకు సంబంధించినవి. ఆయన రెమ్యునరేషన్ మారదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్ తో అనుబంధం, వ్యాపార సంబంధం కలిగి ఉండే ప్రతి ఒక్కరినీ కూడా భయపెట్టాలని అనుకున్నారు. పవన్ తో వ్యాపారం చేయాలంటే కూడా అందరూ జడుసుకునే పరిస్థితి కల్పించాలని అనుకున్నారు. అందుకే నిర్మాత భయపడేలా, థియేటర్ యజమానులు కూడా భయపడేలా దుర్మార్గంగా, ఫ్యాక్షనిస్టులాగా వ్యవహరించారు.
‘టికెట్ ధరల పెంపుకోసం హీరోలు ప్రభుత్వం ఎందుకు రావాలి? మేం అంత లోవెలె్ మనుషులం కాదు’ అని పవన్ ఇప్పుడు చెబుతున్నమాటలను బట్టి.. అప్పట్లో జగన్.. వకీల్ సాబ్ విషయంలో పవన్ కల్యాణ్ కూడా తన ఎదుటకు వచ్చి అడగాలని ఆశించారేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. జగన్ ఆ రకంగా ఎంత వేధించినా.. పవన్ కల్యాణ్ మాత్రం దృఢంగానే ఉండిపోయారు. అంతిమ ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. జగన్ 11 సీట్లకు పరిమితమైన సాధారణ ఎమ్మెల్యేగా సభలో ఉండగా.. పవన్ కల్యాణ్ ప్రభుత్వం కీలక నిర్ణాయక శక్తిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
‘వకీల్ సాబ్’ పై జగన్ కక్ష అందుకేనా?
Monday, January 6, 2025