గేమ్ ఛేంజర్‌ సినిమాలో చరణ్‌ క్యారెక్టర్‌ ఇదేనా!

Monday, July 1, 2024

మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ నటిస్తున్న తాజా సినిమా గేమ్‌ చేంజర్‌…ఈ సినిమాని తమిళ స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో బాలవుడ్‌ ముద్దుగుమ్మ కియారా హీరోయిన్‌ గా చేస్తుంది. అంజలి మరో హీరోయిన్‌ గా చేస్తుంది. ఈ సినిమాలో చరణ్ తండ్రి ,కొడుకుగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కొడుకు పాత్ర పేరు “రామ్ నందన్” అని తండ్రి పాత్ర పేరు “అప్పన్న” అని తెలుస్తుంది.

అప్పన్న పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో రానున్నట్లు సమాచారం. అప్పన్న పాత్రలో రాంచరణ్ లుక్ ఎంతో కొత్తగా ఉంటుంది. అప్పన్న లుక్ లో రాంచరణ్ ఫొటోస్ ఇంతకుముందే లీక్ అయ్యాయి. పంచకట్టులో పవర్ ఫుల్ నాయకుడిగా చరణ్ కనిపించారు. అయితే ఈ సినిమాలో అప్పన్న పాత్రకి నత్తి కూడా ఉంటుందని సమాచారం.ఈ నత్తి సమస్యే సినిమాలో ఎంతో కీలకంగా ఉంటుందంట. అలాగే తండ్రి ఆశయాన్ని నెరవేర్చే రామ్ నందన్ పాత్రలో రాంచరణ్ అద్భుతంగా నటించినట్లు సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles