పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలపై పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక పవర్‌ఫుల్ పోలీస్ కథగా రూపొందుతోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇటీవల ఈ సినిమాలో త్రిప్తి దిమ్రి నటించబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఫ్యాన్స్ మధ్య దీనిపై మిక్స్‌డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఆమె లీడ్ హీరోయిన్ కాదని, సెకండ్ హీరోయిన్ గా ఉంటుందని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ కి త్రిప్తి సరిపోరని, శ్రద్ధా కపూర్ లేదా మృణాల్ తాకూర్ లాంటి హీరోయిన్లు అయితే ఇంకా బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు సంగీతంలోనూ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డితో కలిసి మ్యూజిక్ పనులను స్టార్ట్ చేశాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ, ప్రభాస్ సినిమాల్లో విజిల్ సౌండ్ కి ప్రత్యేక స్థానం ఉందని, అదే జోరునే ఈ సినిమాలో కొనసాగించనున్నట్లు చెప్పాడు.
స్పిరిట్ మూవీ నిర్మాణం టి-సిరీస్ ,భద్రకాళి పిక్చర్స్ కలిసి భారీగా చేపట్టబోతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ బాగానే ప్రత్యేకత కలిగినదని టాక్. సందీప్ రెడ్డి వంగా నుండి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన సినిమా వస్తోందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే కొన్ని పాటలను కంపోజ్ చేయడం మొదలెట్టాడని సమాచారం.
