ఇరుక్కునేది పెద్దిరెడ్డి మాత్రమేనా? జగన్ కూడానా?

Friday, October 4, 2024

జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ ప్రజలను వంచించి పరిపాలన అవకాశం దక్కించుకున్న గత అయిదేళ్ల కాలంలో.. ఎన్ని రకాల అక్రమాలు అరాచకాలు చోటు చేసుకున్నాయో అందరికీ తెలుసు. అవినీతి రాజ్యమేలింది. వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వంలోని పెద్దలు దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. లిక్కర్ తరహాలో.. జగన్ సర్కార్ అతి భారీ దోపిడీకి ఒక మార్గంగా ఎంచుకున్న మరో రంగం మైనింగ్. తను అధికారంలోకి రాగానే కొన్నాళ్లపాటు అసలు ఇసుకు అందుబాటులోలేకుండా చేసేసి.. నిర్మాణ రంగాన్ని సర్వనాశనం చేసి, వందల మంది కూలీల ఆకలిచావులకుకారణమైన జగన్మోహన్ రెడ్డి.. దోపిడీయే తన ఏకైక లక్ష్యంగా కొత్త ఇసుకవిధానం అమల్లోకి తెచ్చారు. కనీసం డిజిటల్ పేమెంట్లకు అవకాశం కూడా ఇవ్వకుండా నాలుగున్నరేళ్లకుపైగా రాష్ట్ర సంపదను వైసీపీ నాయకులు విచ్చలవిడిగా దోచుకున్నారు. ఇప్పుడు ఆ పాపాలన్నీ పండుతున్నాయి. ఇసుక విక్రయాల వ్యవహారంలో జరిగిన అవినీతికి సంబంధించి.. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ప్రస్తుతం ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన వెల్లడిస్తున్న వివరాల క్రమాన్ని గమనిస్తే.. ముందుముందు అప్పట్లో ఆ శాఖకు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే ఇరుక్కుంటారా? లేదా, సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కీలకనిందితుడిగా లెక్క తేలుతారా? అనేది అర్థం కావడంలేదు.

వీజీ వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో.. ‘ఇసుక టెండర్ల వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తగినట్టుగానే తాను నడుచుకున్నానని, అన్నీ వారే చేయించారని, తాను నిమిత్తమాత్రుణ్నని’ చెప్పినట్టుగా తెలుస్తోంది. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను ధిక్కరించే శక్తి తనకు లేదని, అందుకే వారు చెప్పినట్టు అన్నీ చేశానని అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సివిల్ సర్వీసెస్ అధికారిగా అలా ఎలా చేశారని అంటే.. అంతకు మించి తనకు వేరే ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది.

ఇసుక తవ్వకాలు, విక్రయం, సరఫరా బాధ్యతలను ప్రెవేటు సంస్థలకు అప్పగిస్తూ.. తద్వారా విచ్చలవిడిగా రికార్డుల్లో లేని తవ్వకాలకు పాల్పడుతూ అప్పట్లో వైసీపీ నాయకులు వేల కోట్లు దండుకున్నారు. ఇప్పుడు అంతా పెద్దలు చెప్పినట్టే అని వెంకటరెడ్డి అంటున్నారు. ఆ ‘పెద్దలు’ ఎవరనేది ఇంకా స్పష్టంగా లెక్కతేలాల్సి ఉంది. వెంకటరెడ్డిని కస్టడీలో ఉంచుకుని ఏసీబీ వివరాలు రాబట్టేలోగా..అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ఈ కేసులో కీలక నిందితుడిగా ఇరుక్కోవడం గ్యారంటీ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘తప్పులు చేయించిన పెద్దలు’ అనే కేటగిరీలోకి పెద్దిరెడ్డి మాత్రమే వస్తారా? లేదా, అప్పటి సీఎం జగన్ కూడా వస్తారా? అనేది మరో రెండు మూడు రోజుల్లో తేలుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles