పవన్‌ సినిమా మళ్లీ డౌటేనా!

Friday, December 5, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాతో పవన్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి పైగా ఒక వారియర్ రోల్ లో కనిపించనుండడంతో ఒకప్పుడు అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. కానీ ఇపుడుకి ఆలస్యం కావడంతో రిలీజ్ నాటికి ఏమన్నా మారొచ్చు.

అయితే ఆల్రెడీ మార్చ్ చివరిలోనే విడుదలకి రావాల్సిన ఈ చిత్రం మే నెలకి మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది. కానీ మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చేలా ఉందా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ ఇంకా ఐదు రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉన్నట్లు మూవీ మేకర్స్‌ తెలిపారు.  ఆల్రెడీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయ్యింది. సినిమాకి నెల మేర మాత్రమే సమయం ఉంది. ఇంకా పవన్ షూటింగ్ లో పాల్గొనాలి దాని ఎడిటింగ్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు, టీజర్ ట్రైలర్ పాటలు ఇలా చాలా మేటర్‌ ఉండనే ఉంది. మరి ఈ నెల వ్యవధిలో ఏమవుతుందో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles