అంత దారుణమా మంచం విరిగేలా చేశారా

Thursday, March 13, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తనమీద జరిగిన కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నానికి సంబంధించి సరికొత్త సంచలన విషయాలను బయట పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పురమాయింపుsy ఆయనకు సంతృప్తి కలిగించడం కోసం తనను హింసించడంలో పోలీసులు ఎంతగా శృతిమించి వ్యవహరించారో ఆయన చెబుతున్నారు. తనను నిర్బంధించిన తర్వాత ముసుగు వ్యక్తులు వచ్చి, దారుణంగా హింసించిన క్రమంలో తాను పడుకున్న మంచం కూడా విరిగిపోయిందని ఆయన అంటున్నారు. అంత దారుణంగా మంచం విరిగిపోయేలాగా ఒక సిట్టింగ్ ఎంపీ ని సి ఐ డి పోలీసులు లేదా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ప్రైవేట్ సిబ్బందిగా అనుమానిస్తున్న వారు దాడి చేసి కొట్టడం అమానుషం కదా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాలలో నడుస్తోంది.

తాను గుండెకు ఆపరేషన్ చేసుకొని స్టంట్ లు వేసుకొని ఉన్న వ్యక్తిని అని తెలిసి కూడా తన గుండెల మీద ఒక బరువైన వ్యక్తి కూర్చుని హింసించారని ఆయన అంటున్నారు. అలా చేయడం ద్వారా తాను మరణిస్తే గుండెపోటుతో సంభవించిన మృతి కింద చిత్రీకరించాలని చూశారని రఘురామ ఆరోపిస్తున్నారు.
రఘురామ మీద జగన్మోహన్ రెడ్డి కక్ష తీర్చుకోవాలని అనుకున్నారని ప్రజలు అప్పట్లోనే గుర్తించారు. హైదరాబాదునుంచి ఆయనను అరెస్టు చేసి తీసుకువచ్చిన తీరు, కస్టడీలో ఉన్న తరువాత.. కోర్టుకు హాజరయ్యే సమయానికి రఘురామ శరీరం మీద గాయాలు ఇవన్నీ అప్పుడే ప్రజలకు ఆ అభిప్రాయాన్ని కలిగించాయి. అయితే పగ తీర్చుకోవడం, కక్ష సాధించుకోవడం జగన్ లక్షణం అని అర్థం చేసుకున్నారు గానీ.. ఏకంగా సొంత పార్టీ ఎంపీనే చంపించేయాలనేంతగా ఈ స్థాయిలో హింసించారా? అని ప్రజలు విస్తుపోతున్నారు.

తన సెక్యూరిటీగా ఉన్న పోలీసు అధికారల్ను బయటకు పంపి, అప్పటీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సొంత మనుషులు ముసుగులతో వచ్చి ఎలా తన మీద దాడి చేశారో.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం గుంటూరు జీజీహెచ్ కు తీసుకువెళ్లిన తర్వాత అక్కడి డాక్టర్లను ఎలా బెదిరించి ఆ సర్టిఫికెట్లు పుట్టించారో అన్నీ రఘురామ పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. మరి ఇప్పుడు విజయపాల్ అరెస్టు అయి రిమాండులో ఉన్న సమయంలో ఆయనను విచారించడం ద్వారా.. సీఐడీ పోలీసులు ఈ వివరాలన్నీ రాబడతారా? ఇంకా కేసులో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారు? అనేది చర్చనీయాంశంగా ఉంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles