దేశంలో ఒక చోట నుంచి మరొకచోటకు డొమెస్టిక్ విమాన ప్రయాణాలు చేయాలంటేనే అనేకానేక నియమాలు, నిబంధనలు, పత్రాలను తనిఖీ చేయడం వంటి వ్యవహారాలుంటాయి. అదే విదేశాలకు వెళ్లడం అంటే ఇక చెప్పనవసరం లేదు. పోలీసుల కళ్లుగప్పి దొంగచాటుగా విదేశాలకు వెళ్లడం అసాధ్యం అని మనం అనుకుంటాం. కానీ.. ఇవన్నీ కూడా కేవలం మనబోటి సామాన్యులకు మాత్రమే. అక్రమార్కులు, నేరస్తులు, వందల వేల కోట్లు ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును కాజేసిన వారు ఎంచక్కా నకిలీ గుర్తింపు పత్రాలు పెట్టుకుని విదేశాలకు చెక్కేస్తున్నారు. ఏపీలో గత ప్రభుత్వ కాలంలో రకరకాల తప్పుడు పనులు చేసి.. ఇప్పుడు నకిలీ పత్రాలను సృష్టించి దుబాయికి పారిపోయే వారి సంఖ్య ఎక్కువవుతోంది. వీళ్లు ఇంత ఈజీగా ఎలా దేశం దాటగలమనుకుంటున్నారో అర్థ: కావడం లేదని ప్రజలు విస్తుపోతున్నారు. అదృష్టవశాత్తూ లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితులు ఇద్దరు అలా విదేశాలకు చెక్కేయక ముందే పోలీసులు అప్రమత్తమై పట్టుకున్నారు.
ఏపీలో లిక్కర్ స్కామ్ అంటే మామూల్ది కాదు. పక్కా సాక్ష్యాధారాలతో సహా నేరాలు నిరూపణ అయ్యాయంటే.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మిగిలిఉన్న నాయకుల్లో సగం మంది శాశ్వతంగా కటకటాల వెనక్కి వెళ్లిపోతారనే అంచనాలు ప్రజల్లో ఉన్నాయి. క్విడ్ ప్రోకో అవినీతి కేసుల్లో బెయిలు మీద ఉంటూ ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన జగన్మోహన్ రెడ్డి కూడా వారిలో ఒకరుగా ఉండాల్సిందేననే అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో కీలక నిందితులు.. నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించి దుబాయికి పారిపోయే ప్రయత్నాలను రెండింటిని పోలీసులు భగ్నం చేసారు.
కొన్ని రోజుల కిందట లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అయిన కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి హైదరాబాదు విమానాశ్రయంలో సిట్ పోలీసులకు పట్టుబడ్డారు. నిజానికి ఆయనది చాలా పెద్ద స్కెచ్. కొన్ని వారాలుగా పరారీలో ఉంటూ.. మరురోజు విచారణకు వస్తానని సిట్ పోలీసులకు సమాచారం పంపారు. ఆ రకంగా వారు తనను వెతికే ప్రయత్నాల నుంచి రిలాక్స్ అవుతారని ఆశించారు. గోవానుంచి హైదరాబాదులో దిగి, అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న నకిలీ పత్రాలతో దుబాయి వెళ్లిపోవాలని అనుకున్నట్టుగా తెలిసింది. మొత్తానికి సంగతి తెలుసుకని ముందే అరెస్టు చేశారు పోలీసులు.
ఇప్పుడు రాజ్ కెసిరెడ్డి సహాయకుడు, పీఏ అయిన పైలా ప్రదీప్ కూడ అలాగే అరెస్టు అయ్యరు. నకిలీ పత్రాలను తయారుచేసుకుని చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయి పారిపోవాలని స్కెచ్ వేశారు. పోలీసులకు సంగతి తెలిసి చెన్నైలో పట్టుకున్నారు.
వీరి ప్రయత్నాలు చూస్తోంటే.. వైసీపీ నాయకులకు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం.. అధికారం పోగానే తప్పుడు పత్రాలు తయారుచేసుకుని విదేశాలకు పారిపోవడం అలవాటుగా మారుతున్నట్టుందని ప్రజలు అనుకుంటున్నారు. వల్లభనేని వంశీ అనుచరులు కొందరు, ఇతరత్రా వైసీపీ నాయకులు కొందరు కేసులనుంచి తప్పించుకోడానికి విదేశాల్లో తలదాచుకుంటున్నట్టుగా ప్రచారం ఉంది.
విదేశాలకు పారిపోవడం మరీ అంత ఈజీనా?
Monday, December 8, 2025
