శుభం కార్డు పడినట్లేనా…?

Monday, January 6, 2025

టాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ వచ్చే వారం వేడుకగా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా, జాతీయ నటుడు అల్లు అర్జున్ ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులు  క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చిత్ర నిర్మాతలపై కొన్ని సంచలన కామెంట్లు చేశాడు.

దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌తో దేవిశ్రీ ప్రసాద్‌కు మధ్య తేడాలు వచ్చాయని.. ఇకపై ఈ బ్యానర్‌లో దేవిశ్రీ  వర్క్ చేయడనే టాక్ సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్న వార్త. అయితే, ఇదే ప్రశ్నపై చిత్ర నిర్మాతలు తాజాగా ఓ క్లారిటీ ఇచ్చారు.

‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్ మీట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి ఈ ప్రశ్నకు సమాధానంగా.. దేవిశ్రీ మాట్లాడిన మాటల్లో ఏం తప్పు కనపడదు. ప్రేమ ఉన్న చోటే కంప్లెయింట్స్‌ ఉంటాయి. భవిష్యత్తులోనూ దేవిశ్రీ తో కచ్చితంగా ప్రాజెక్టు చేస్తాం అంటూ ఆయన అదిరిపోయే సమాధానమిచ్చారు.

ఈ స్టేట్మెంట్‌తో దేవిశ్రీ – మైత్రీ మధ్య చెలరేగిన వివాదానికి ఫుల్‌స్టాప్ పడిందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినపడుతుంది. ఇక  పుష్ప-2 ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ అందరూ పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles