బాలయ్య పాత్ర పై ఇంట్రెస్టింగ్‌ బజ్‌!

Andhrawatch
1 Min Read

నందమూరి నటసింహం బాలయ్య బాబు, దర్శకుడు బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య పాత్ర పై ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. పవర్ ఫుల్ మాఫియా డాన్ గా బాలయ్య పాత్ర ఉంటుందని… ముఖ్యంగా బాలయ్య పాత్రలోని డెప్త్ కూడా నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని సమాచారం.

పైగా బాలయ్య పాత్రలో ఫుల్ ఎంటర్ టైయినింగ్ యాంగిల్ కూడా ఉంటుందని సమాచారం. మొత్తానికి ఊహించని రేంజ్ లో  బాలయ్య పాత్ర ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Share This Article