ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు..నాగబాబు హాట్‌ కామెంట్స్!

Monday, January 13, 2025

మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్న కమిటీ కుర్రోళ్ళు ఆగస్టు 9 వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా  ప్రచారాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరు కాగా, నాగ బాబు కూడా ఈ ఈవెంట్ కి  ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నాగ బాబు చేసిన కామెంట్స్ మరోసారి అటు ఇండస్ట్రీలో కానీ..అటు రాజకీయాల్లో కానీ హాట్ టాపిక్ గా మారాయి.

మెగా ఫ్యామిలీ, వీళ్ళు తప్ప ఇంకెవరూ ఉండరు, కొంతమంది ఫ్యామిలీస్ మీద కూడా ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడే వారిని చాలా మందిని చూశాం. కానీ మాకు అలాంటి ఫీలింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీ మా అబ్బ సొత్తు కాదు. మా నాన్న సామ్రాజ్యం కాదు. మా తాత సామ్రాజ్యం కాదు. అలాగే అక్కినేని ఫ్యామిలీనో, నందమూరి ఫ్యామిలీనో కాదు…అందరిదీ. అడివి శేష్ లాంటి ఎంతోమంది సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప్రపంచంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. వాళ్ళంతా కూడా  టాలెంట్ తో కష్టపడి పైకి వచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles