ఇండియా నెం.1 హీరో ప్రభాస్‌..మరి హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Wednesday, December 18, 2024

పాన్ ఇండియా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ‘ప్రభాస్’ మరో గొప్ప ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ‘ఆర్మాక్స్‌’ విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో నంబర్ వన్‌గా ప్రభాస్‌ నిలిచారు. జూన్‌ నెలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాను ఆర్మాక్స్‌ విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌ మొదటి స్థానంలో నిలవగా.. మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ల జాబితాలో బాలీవుడ్ భామ అలియా భట్‌ టాప్‌లో నిలిచింది.

మే నెలలో ఆర్మాక్స్‌ విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో  కూడా ప్రభాస్ టాప్‌ వన్‌లోనే ఉన్నారు. ప్రభాస్ వరుసగా టాప్‌లో నిలవడానికి ‘కల్కి 2898 ఏడీ’ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలై నాలుగో వారంలోకి వచ్చినప్పటికీ కల్కి హవా కొనసాగుతున్న నేపథ్యంలో జులైలో కూడా ప్రభాసే నంబర్ వన్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రభాస్‌  హ్యాట్రిక్ కొట్టినట్లే. జూన్‌ నెల జాబితాలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ రెండో స్థానంలో ఉన్నారు.

దళపతి విజయ్ మూడో స్థానంలో ఉన్నారు. టాలీవుడ్ హీరోస్ అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మహేష్ బాబులు వరుసగా 4, 5,6 స్థానాల్లో నిలవగా.. రామ్‌ చరణ్‌ 9వ స్థానంలో ఉన్నారు.ఆర్మాక్స్‌ మీడియా విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ల జాబితాలో అలియా భట్‌ నంబర్ వన్‌గా నిలిచారు. సమంత, దీపికా పదుకొణె, కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్ టాప్-5 జాబితాలో నిలవగా… టాప్ 10 జాబితాలో 6 మంది దక్షిణాది సినిమాలకు చెందిన వారు ఉండగా.. 4 గురు బాలీవుడ్‌కు చెందినవారు ఉండడం విశేషం. నయనతార, రష్మిక, కియారా అద్వానీ, కృతి సనన్, త్రిషలు టాప్ 10 లో ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles