ఈ విషయం గమనించారా? ఈ సంగతి గ్రహించారంటే సంక్షేమ పథకాల కింద పెన్షన్లు పొందుతున్న పేదల్లో ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు. అసలు జగన్ కు వేయబుద్ధి కాదు. నా అవ్వా నా తాతా.. నా అక్కచెల్లెమ్మలు అంటూ మాయమాటలను తియ్యగా చెబుతున్నారే గానీ.. పథకాల ద్వారా లబ్ధిని కాస్త పెంచి అందించే విషయంలో ఎలాంటి వంచనకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారో ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న పేదలు ఒక్కొక్కరికి ఈ అయిదేళ్లలో 57 వేల రూపాయలు నష్టపోబోతున్నారు. ఎలాగో తెలుసుకుంటే మీరు కూడా విస్తుపోతారు.
చంద్రబాబునాయుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పింఛనును 4000 చేస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే జులై నెలలో అరియర్స్ కలిపి 7వేల రూపాయల పింఛను అందిస్తామనేది ఆయన చెప్పిన మాట. ప్రస్తుతం జగన్ సర్కారు వారికి మూడువేల పెన్షను మాత్రమే అందిస్తోంది. మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ అందులో అయిదేళ్లకూ కలిపి 500 మాత్రం పెంచేలా హామీ ఇచ్చారు. అది కూడా.. 2028 ఏప్రిల్లో 250, 2029 ఏప్రిల్లో (అంటే జస్ట్ ఎన్నికలకు ముందు) మరో 250 పెంచుతానని పేర్కొన్నారు. ఒకవేళ అప్పటికి ఎన్నికల కోడ్ వచ్చేసి ఉంటే ఆ పెంపు కూడా ఉండదు. ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే పెంచుతానని జగన్ డ్రామా ఆడే అవకాశం ఉంది. అంటే జగన్ ను గెలిపిస్తే ఇప్పుడున్న మూడు వేలు కాకుండా.. అయిదేళ్లకు కలిపి కేవలం మూడువేల రూపాయలు మాత్రం ప్రజలకు అందుతాయన్నమాట.
ఇప్పుడు ఈ ఇద్దరి హామీలను పోల్చి చూస్తే..
చంద్రబాబు ఇచ్చేది అయిదేళ్లలో రూ.2.40 లక్షలు
జగన్ ఇచ్చేది అయిదేళ్లలో రూ.1.83 లక్షలు
తేడా 57 వేలు.
అంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు ఎవ్వరైనా సరే.. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే గనుక.. రాబోయే అయిదేళ్లలో అచ్చంగా 57 వేల రూపాయలు కోల్పోబోతున్నారన్నమాట. ఈ వాస్తవం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని తెలుగుదేశం శ్రేణులు రంగంలోకి దిగుతున్నాయి. జగన్ మాయమాటలను నమ్మవద్దని వారు చెబుతున్నారు.