వివేకం’ చూసి ఓటేస్తే వాళ్లగతి అంతే!

Wednesday, January 22, 2025

కడపజిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డి ప్రస్తుత ఎన్నికల గురించి చిత్రమైన భాష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మూలాలు కలిగిఉన్న ఈ మాజీ మంత్రి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కడప ఎంపీ ఎన్నికల్లో తాను వైకాపా అభ్యర్థి అవినాష్ రెడ్డికి మద్దతు ఇవ్వడం లేదని డీఎల్ స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన మైదుకూరు నియోజకవర్గం నుంచి మాత్రం ఆయన తెలుగుదేశం అభ్యర్థి పుత్తా సుధాకర్ యాదవ్ కే తన మద్దతు అని ప్రకటించారు. అక్కడినుంచి వైసీపీ తరఫున బరిలో ఉన్న సిటింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘుురామిరెడ్డికి ఓటు వేయవద్దని ఆయన పిలుపు ఇస్తున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జిల్లాలోని సీనియర్లలో ఒకరైన డీఎల్ రవీంద్ర రెడ్డి చెబుతున్న మరొక మాట.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి పడే ఓట్లకు గండి కొట్టేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు ‘వివేకం’ సినిమా చూసి ఓటు వేయాలని ఆయన అంటున్నారు. వివేకం సినిమా యూట్యూబ్ లో ఉన్నదని దానిని చూసిన తర్వాతే ఓటు వేయాలని పిలుపు ఇస్తున్నారు.

వివేకం సినిమా.. వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా రూపొందిన సినిమా. వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర పెద్దల పాత్రలను ధ్రువీకరించేలాగా ఈ సినిమా ఉన్నదనే మాట వినిపిస్తోంది. వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేసిన వైనం ఇందులో చిత్రీకరించారు. ఇది చూసిన వారికి అవినాష్ రెడ్డి అసలు హంతకుడు అనే సంగతి అర్థమైపోతుందని అనుకుంటున్నారు. పైగా సినిమా చివర్లో ఒరిజినల్ విజువల్స్ ను కూడా చూపిస్తూ.. తమ వాదనకు మరింత బలం సినిమా రూపకర్తలు ఇచ్చుకున్నారు.

అలాంటి సినిమాను రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చూడాలని డీఎల్ రవీంద్ర రెడ్డి పిలుపు ఇస్తున్నారు.
కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నాయకులు, అనుచరులు తన వద్దకు వచ్చి ఎంపీ విషయంలో ఏం చేద్దాం అని అడుగుతున్నారని, వివేకం సినిమా చూసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి చెబుతున్నాననని డీఎల్ వివరించారు. డీఎల్ రవీంద్ర రెడ్డి కాంగ్రెసులో  ఉండగా.. ఒక దశలో వైఎస్ రాజశేఖర రెడ్డిని అదే జిల్లాలో తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడు. ఆ తర్వాతి పరిణామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థికే మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయే కూటమి గెలుస్తుందని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని డీఎల్ జోస్యం చెబుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles