ఈ దందా వివరాలు తెలిస్తే పుష్ప 4 కూడా తీయవచ్చు!

Monday, December 8, 2025

తిరుపతి పరిసరాల్లో ఉండే శేషాచలం కొండలలో మాత్రమే అరుదైన ఎర్రచందనం లభిస్తుంది. ఈ ఎర్రచందనం అక్రమంగా నరికి విదేశాలకు స్మగ్లింగ్ చేయడం అనేది కథాంశంగా పుష్ప వన్ టూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమా చూస్తే ఇదే ఎర్రచందనం కథాంశంగా పుష్ప 3కు కూడా రంగం సిద్ధం చేసినట్లు మనకు అర్థమవుతుంది. కానీ తిరుపతి పక్కనే ఉండే నెల్లూరు జిల్లాలో భూగర్భంలో దొరికే గనులను అక్రమంగా తరలించడంలో సాగించే దందా కూడా ఇలాంటిదే. పుష్ప టు సినిమాలో హీరో తన చెప్పుచేతల్లో ఉండగల వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి 500 కోట్లు సునాయాసంగా ఖర్చు చేస్తాడు. అంటే ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిని కొనుక్కోవడానికి కాగల ఖర్చు 500 కోట్లు అవి ఒక చిన్న సంకేతం ఇచ్చారు. కానీ జగన్ జమానాలో అంతకంటే చాలా ఖరీదే అని నెల్లూరు జిల్లా మైనింగ్ దందాలను గమనిస్తే మనకు అర్థమవుతుంది.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద అక్రమమైనింగ్ కు సంబంధించిన కేసులు నమోదు అయినప్పుడు కేవలం ఆయన అనుచరులతో తవ్వించడం,  తాను స్వాహా చేయడం మాత్రమే అని అందరూ అనుకున్నారు. కానీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారణలో మరిన్ని వివరాలు రాబట్టిన తర్వాత ఇంకొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. అనిల్ కుమార్ అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని ఇంకా పెద్ద దందా నడిపించినట్లుగా తెలిసింది. శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అనిల్ కుమార్ యాదవ్ ని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వెల్లడైన దిగ్భ్రాంతికk విషయాలలో సాక్షాత్తు బిగ్ బాస్ కు కూడా ఈ మైనింగ్ అక్రమ వసూళ్ల నుంచి నెలవారీ వాటా వెళుతున్నట్లుగా గుర్తించారు.

లీజులు ముగిసిన అసలు లీజులేలేని ప్రదేశాల నుంచి మంత్రుల అనుచరులు తవ్వకాలు సాగించడం మాత్రమే కాదు.. నెల్లూరు జిల్లాలో ఎవరు మైనింగ్ చేస్తున్నా వారందరి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న క్వార్ట్జ్ టన్నుకు ఏడు నుంచి పదివేల రూపాయలు వంతున దందా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వసూళ్ల మొత్తం నుంచి నెలకు 20 కోట్లు బిగ్ బాస్ కు చేరవేసేవారంటే అర్థం చేసుకోవచ్చు.  కేవలం 9 నెలల్లో ఇలా 180 కోట్లు చేరినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఇదే దందా ఐదేళ్లపాటు కొనసాగి ఉంటే గనుక 1000 కోట్లకు మించిన వ్యవహారంగా మారిపోయేది. అంటే పుష్ప ఫోర్ ప్లాన్ చేసే సమయానికి ఎర్రచందనం బదులుగా ఈ మైనింగ్ దందాలోకి కూడా పుష్ప ప్రవేశించినట్లుగా సీఎంను గుప్పిట పెట్టుకోవడానికి వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినట్టుగా కథ రాసుకోవచ్చునన్నమాట. అలాగే ఫారిన్ షూటింగుల కోసం చైనాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ నడిపించేటట్లుగా కథ తయారు చేసుకోవచ్చు అని జనం నవ్వుకుంటున్నారు.
నెల్లూరు జిల్లా అక్రమ మైనింగ్ దందాను పునాదుల దాకా తవ్వితే.. వైసీపీలోని ఇంకా అనేకమంది పెద్ద నాయకుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles