ఆఫీసు మారిస్తే రాతమారుతుందా జగన్!

Friday, July 5, 2024

ఖేల్ ఖతమ్.. దుకాన్ బంద్ అని సామెత. తన విషయానికి వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖేల్ ఖతమ్ అవగానే.. ఆఫీసు బంద్ అని నిరూపిస్తున్నారు.  తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ మూసివేసింది. ప్రస్తుతం జగన్ నివాసానికి పక్కనే ఉన్న సీఎం క్యాపు ఆఫీసుగా వాడుకుంటున్న భవనాన్నే పార్టీ రాష్ట్ర కార్యాలయంగా వాడుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల పదో తేదీనుంచి అక్కడినుంచే పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

అయితే.. ఆఫీసు మార్చడం వెనుక రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ‘నీ వైఫల్యాలను తెలుసుకోకుండా పార్టీ కార్యాలయం మార్చినంత మాత్రాన.. నీకు మళ్లీ వైభవం దక్కుతుందని అనుకుంటున్నావా జగనన్నా’ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ హోరెత్తుతున్నాయి. ‘నీ పరాజయాన్ని నిన్న ఈవీఎం లమీదికి నెట్టేశావు.. ఇవాళ వాస్తు మీదికి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నావా?’ అని కూడా ప్రశ్నిస్తున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి అనుసరించే మతం పరంగా క్రిస్టియను అయినప్పటికీ.. ఆయన అన్ని రకాల సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్న తర్వాత.. ప్రహరీకి ఒక వైపు నుంచి ఆయన పోర్టికోలోని కార్ల, వ్యక్తుల కదలికలు అవతలి వైపు ఉన్న భవంతుల్లోని వారికి కనిపించే అవకాశం ఉండడంతో జగన్ అటువైపు ఇనుప గేట్లు బాగా ఎత్తుగా పెట్టించారు. సరిగ్గా ఎన్నికలకు ముందు.. ఆ గేట్ల గురించి ఏ వాస్తు పండితులు సూచించారో గానీ.. ఉన్నపళంగా వాటిని కట్ చేసి తొలగించే పనులు చేయించారు. కేవలం వాస్తు సలహాల కారణంగా.. వైభవం జారిపోతుందనే భయంతో ఆ పని చేయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్ని వాస్తు దోషాలు దిద్దినా అధికారం దక్కలేదు సరికదా.. కేవలం 11 సీట్లే వచ్చాయి. పరువు పోయింది.

ఇప్పుడు పార్టీ రాష్ట్రకార్యాలయాన్ని ఎందుకు మారుస్తున్నారు అనేది చర్చనీయాంశంగా ఉంది. ఆఫీసు మార్చినంత మాత్రాన ఆయన రాత మారుతుందా? అని కొందరు.. రెండు ఆఫీసులను భరించే ఆర్థిక స్తోమత పాపం వైఎస్సార్ కాంగ్రెస్ కు లేదేమోనని పలువురు జోకులు వేసుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles