బూతు నోర్లతో చెలరేగితే… బేడీలు తప్పవు!

Monday, December 23, 2024
నోటినిండా బూతులు నింపుకుని, తెలుగుదేశం నాయకుల మీద విచ్చల విడిగా వాటిని వర్షింపజేస్తూ వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు.. ఇప్పుడు తమ నోర్లకు తాళాలు వేసుకోవాల్సిందే. తాళాలు వేసుకోకుంటే అవే నోర్లకు కూడా ఏకంగా బేడీలు పడే ప్రమాదం ఉంది. నిజానికి వైసిపి నాయకులు కూడా ఆ స్పృహతోనే ఉన్నారు. అతిగా మాట్లాడడం లేదు. అయితే తమాషా ఏంటంటే.. ఇప్పటి సంగతి మాత్రమే కాదు, ఇదివరకు నోరు పారేసుకున్న బూతులు వర్షించిన వారిని ఆ పాపాలు ఇప్పుడు కూడా వెన్నాడుతున్నాయి. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సీదిరి అప్పల రాజు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల మీద చర్య తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష , కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పట్లో అప్పలరాజు సభలో చంద్రబాబు గురించి అతిగా మాట్లాడారు. చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదని ఒక వైద్యుడిగా తాను ధృవీకరిస్తాను అన్నారు. చంద్రబాబుకు చికిత్స చేయించి మానసిక పరిస్థితి బాగైన తరువాతే సభలోకి రానివ్వాలని అన్నారు. ఈ వ్యాఖ్యల మీదనే ఇప్పుడు పోలీసు కేసు నమోదు అయింది. పోలీసులు గట్టిగా వ్యవహరిస్తే సీదిరి నోటి బేడీలు పడే అవకాశం కూడా ఉంది.
అయితే ఈ మాత్రం కామెంట్లకే కేసుపెడితే..  వైసిపి నాయకులలో బాబును బండ బూతులు టిట్టిన ఇతర నాయకుల పరిస్థితి ఏమిటి అని టీడీపీ వారు అనుకుంటున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ దగ్గర్నించి చిల్లర నాయకుల వరకు నోటికి అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా బాబును తిట్టిన వైనం అందరికీ తెలిసిందే. గౌతు శిరీష స్ఫూర్తితో ఇలాంటి బూతు నోర్ల నాయకుల మీద కేసులు పెట్టడం ప్రారంభిస్తే రాష్ట్రమంతా ఈ కేసుల వెల్లువే అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కేసులు బనాయిస్తే తప్ప.. భవిష్యత్తులో కూడా ఇలాంటి నీటి దూకుడు నేతలకు బ్రేకులు పడవు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles