ఇవాళ కూటమి ప్రభుత్వం ఏపీలో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తోంది. రాష్ట్రంలోని మహిళలకు తమ సొంత జిల్లా పరిధిలో ఈ అవకాశం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వారు.. రాష్ట్రమంతా వర్తించేలా అమలుచేయడం చాలా గొప్పవ విషయం. అయినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ అద్భుతమైన పథకం గురించి కూడా.. ప్రజల మెదళ్లలో విషం నిపండానికి నానా పాట్లు పడుతున్న సంగతి మనం గమనిస్తున్నాం. డీలక్స్, ఏసీ, లగ్జరీ,నాన్ స్టాప్ బస్సుల్లో కూడా ఉచితం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, తిరుమల, శ్రీశైలం వంటి ఘాట్ రోడ్డు పుణ్యక్షేత్రాలకు ఉచితం అనుమతించకుండా వంచిస్తున్నారని వక్రమైన బుద్ధులతో ఆరోపణలు చేస్తున్నారు. పనిచేస్తున్న చంద్రబాబు సర్కారు మీద బురద చల్లడం కాదు. జగన్ మోహన్ రెడ్డికి చేతనైతే.. తాను ముఖ్యమంత్రి అయితే ఈ పథకాన్ని ఎలా అమలు చేయదలచుకున్నాడో స్పష్టంగా చెప్పాలి.. అని ప్రజలు కోరుకుంటున్నారు.
ఫరెగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా.. సంక్షేమ పెన్షన్లు ఉన్నాయి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు ఇస్తూ వచ్చారు. చంద్రబాబునాయుడు ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చాడు. పెన్షను నాలుగువేలకు పెంచుతానని, ఏప్రిల్ నుంచి ఇస్తానని అన్నారు. వికలాంగులకు 6వేలకు పెన్షను పెంచుతానన్నారు.. పెంచారు! ఇలా ఉన్న ప్రభుత్వంచేస్తున్న పనుల్లో అభ్యంతరాలు ప్రతిపక్షానికి కనిపించినప్పుడు.. వాటిని ఎత్తిచూపుతూనే తాను ఏంచేయగలనో చెప్పడం రాజకీయంగా ధీరత్వం అనిపించుకుంటుంది.
కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కుటిల నీతి! ఆయన మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా కల్పిస్తున్న ఉచిత బస్సుప్రయాణ అవకాశాన్ని తూలనాడుతారు. నిందిస్తారు. తన అనుచరులతో బురద చల్లిస్తారు. అంతేతప్ప తాను ఏం చేస్తాననేది మాత్రం చెప్పారు.
చంద్రబాబు మోసం చేశారని, డీలక్స్, ఏసీ బస్సుల్లో ఉచితం ఇవ్వడం లేదని అంటున్నారు. మరి తాను మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కేటగిరీ బస్సుల్లో ఉచితం అనుమతిస్తాం అని చెప్పగల ధైర్యం జగన్ కు ఉన్నదా? అనేది ప్రజల ప్రశ్న. చేతనైతే అలాంటి ప్రకటన చేయాలి గానీ.. మోసం మోసం అంటూ కుటిలప్రచారం చేయడం తగదని పలువురు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రజలను మాత్రమే కాదు.. ఈ రకమైన మాయమాటలతో తన సొంత పార్టీవారిని కూడా మోసం చేస్తూనే ఉన్నారనేది పలువురి పరిశీలన. ఎందుకంటే.. ఆయన తన 2.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కోటీశ్వరుల్ని చేస్తానని, ఇప్పుడు వారిని వేధిస్తున్న వారినందరినీ రప్పా రప్పా నరుకుతానని చెబుతారే తప్ప.. తన ప్రభుత్వం మళ్లీ వచ్చేదాకా కార్యకర్తలకు భరోసాగా ఏం చేయదలచుకున్నాడనేది ఎప్పటికీ చెప్పరు! ఇదంతా జగన్ మార్కు వంచన అని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్ కు చేతనైతే అలాంటి ప్రకటన చేయాలి!
Friday, December 5, 2025
