నేను బాలయ్య బాబు సెట్లో అలా చేసేవాళ్లం!

Sunday, December 8, 2024

సినీ పరిశ్రమకు చెందిన వారిలో తెలుగమ్మాయిలు చాలా తక్కువమందే ఉన్నారని చెప్పుకొవచ్చు. వారిలో చాందిని చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ అతి త్వరలోనే నందమూరి నటసింహం బాలయ్య బాబు ఎన్బీకే 109 లో కనిపించనుంది.  ఈ సినిమాలో ఆమె ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంగళవారం బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ టైంలో బాలయ్యతో దిగిన ఓ స్పెషల్ ఫోటో కూడా షేర్ చేసి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

తాజాగా చాందిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అందులో ఎన్బీకే 109 సినిమా గురించి బాలయ్య బాబు గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ అయిపోయింది. ఇందులో నేను ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర ఫుల్ లెంగ్త్ ఉంటుంది .

ఒక స్టార్ హీరో సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ నటిస్తున్నాను. కథలో నాది చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర. సెట్ లో బాలయ్య చాలా సరదాగా ఉంటారు. సెట్ లో మేమేమిద్దరం కలిసి అందరి మీద ప్రాంక్స్ చేసేవాళ్ళం సరదాగా.   బాలయ్య బాబు షాట్‌ ఉన్నా లేకపోయినా సెట్ లోనే ఉంటారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి అందరితో ఈజీగా కలిసిపోతారు” అంటూ బాలయ్య బాబు గురించి చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles