రజనీకాంత్ తో సినిమా అలా మిస్ అయిపోయింది!

Thursday, April 3, 2025

రజనీకాంత్ తో సినిమా అలా మిస్ అయిపోయింది! స్టార్ నటుడిగా అలాగే స్టార్ దర్శకుడిగా సౌత్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్, ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌ (రాజు కన్నా గొప్పవాడు)’ విడుదలకు సిద్దంగా ఉంది.

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఒక గ్రాండ్ ఈవెంట్‌లో విడుదలైంది. ఈ ట్రైలర్ చాలా మందిని ఆకట్టుకుంది. అయితే, ఈ కార్యక్రమంలో, పృథ్వీరాజ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇంతకీ, పృథ్వీరాజ్ సుకుమారన్ ఏం అన్నారంటే… ‘లైకా ప్రొడక్షన్స్ సంస్థ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తో దర్శకుడిగా ఓ సినిమా చేయమని నన్ను అప్రోచ్‌అయ్యింది.

నాలాంటి యంగ్‌ డైరెక్టర్‌ కి ఆ అవకాశం గొప్పది. పైగా అది నా కల కూడా. అయితే, ఆ ప్రాజెక్టు అనుకున్నట్లుగా ప్రారంభం అవ్వలేదు. నిర్మాణ సంస్థకి నచ్చే విధంగా ఓ గొప్ప కథను నేను ఆ టైమ్‌లో రాయలేకపోయాను’ అని పృథ్వీరాజ్ అన్నారు. దాంతో ఆ సినిమా అలా మిస్‌ అయిపోయిందంట.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles