స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ‘ఘాటి’ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి దర్శకుడు క్రిష్ ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. ఆయనతో పాటు సినిమా టీమ్ కూడా ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ లో బిజీగా కనిపిస్తున్నారు.
కానీ ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమిటంటే, అనుష్క మాత్రం ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించలేదు. దీంతో ఆమె ఈసారి ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని అభిమానులు అనుకున్నారు. కానీ అసలు పరిస్థితి వేరేలా ఉంది. స్క్రీన్ మీద కనిపించకపోయినా, అనుష్క తనదైన స్టైల్ లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తోంది.
ఇటీవల ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ద్వారా ఆమె ‘ఘాటి’ గురించి ప్రస్తావించింది. అంతేకాకుండా రానా దగ్గుబాటితో జరిగిన ఫోన్ సంభాషణలో కూడా ఈ సినిమా పేరు ప్రస్తావించి పరోక్షంగా ప్రమోట్ చేసింది. ఇప్పుడు ఓ రేడియో ఛానల్ లో అభిమానులతో ప్రత్యేకంగా మాట్లాడేందుకు కూడా ప్లాన్ చేసింది.
