శాంతి లాంటి కూతుళ్లు ఎందరున్నారు విజయసాయీ?

Thursday, November 21, 2024

విజయసాయిరెడ్డి ఒక కొత్త కూతురు గురించి సమాచారం అధికారికంగా బయటపెట్టారు. ‘ఇదేమిటి చెప్మా.. ఆయనకు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతితో కొడుకు పుట్టాడని కదా  ఆమె భర్త ఆరోపిస్తున్నది.. మీడియాలో ప్రచారం అవుతున్నది.. మరి కూతురు వివరాలు అంటున్నారేమిటి?’ అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు! కానీ ఇది నిజం!! తన ఎక్స్ ఖాతా ద్వారా కొత్త కూతురు ఎవరో, ఆ కూతురు పట్ల తాను ప్రదర్శిస్తున్న ప్రేమానురాగాలు ఎంత స్థాయిలో ఉన్నాయో..విజయసాయిరెడ్డి స్వయంగా వెల్లడించారు. అయితే ఇలాంటి కొత్త కూతుర్లు ఎంతమంది ఉన్నారో మాత్రం ఆయన లెక్క చెప్పలేదు.

ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న శాంతి తనకు కూతురు వంటిదని విజయ సాయి రెడ్డి ప్రకటించడం ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. శాంతిని విజయసాయిరెడ్డి మొదటిసారిగా ఒక ఎండోమెంట్స్ అధికారిగా విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలోనే 2020లో కలిశారట. ఆయన చెబుతున్న మాటలను బట్టి తొలిచూపులోనే ఆమెను కూతురుగా భావించినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ‘ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఆమెను కూతురుగానే భావిస్తున్నాను’ అని విజయం సాయి రెడ్డి పేర్కొన్నారు!
సాధారణంగా ఎవరికైనా తొలిసారి కలిసినప్పుడు- తొలిచూపులో వలపు పుడుతూ ఉంటుంది.

అలాంటివి మనం అనేకం వింటుంటాం, చూస్తుంటాం! కానీ విజయసాయిరెడ్డి లాంటి ఉదాత్తమైన వ్యక్తికి శాంతిని చూడగానే ఆమెలో కూతురు కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాలుగేళ్లుగా కూతురు గానే ఆమెను చూసుకుంటున్నారు. ‘ఒక తండ్రి లాగా ఆమెకు ఏం సహాయం కావాలన్నా చేశాను’ అని ఆయన అంటున్నారు. బహుశా తండ్రి- కూతుర్లకు ఆస్తులు ఇచ్చినట్లుగా ఆమెకు ఆర్థికంగా కూడా సహకరించి ఆమె కోట్ల రూపాయల నివాస భవనం కట్టుకుంటే అందుకు తోడ్పాటు అందించారో ఏమో తెలియదు.

ఆమెను కూతురు లాగా చూసుకుంటున్నాడు కనుకనే- ఆమె తనకు కొడుకు పుట్టాడని చెప్పగానే ఆమె ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారట! అలాగే మళ్ళీ తాడేపల్లిలోని తన నివాసానికి ఆమెను కొడుకు సహా తీసుకువచ్చి ఆశీర్వదించారట! పాపం కూతురు కాబట్టే ఒక్క పరామర్శతో సరిపెట్టకుండా ఇంటికి పిలిచి మరీ ఆశీర్వదించారు విజయసాయిరెడ్డి!!

అధికార పార్టీలో ఎంపీగా ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న ఒక మహిళ అధికారిని కూతురు లాగా భావించడం చాలా గొప్ప సంగతి. కనిపించిన మహిళలు కూతురుగా భావించే నైజం ఆయన గొప్పదనం! అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి లాగా ఎంతమందిని కొత్తగా కూతుళ్ళలాగా పరిగణిస్తూ వచ్చారో.. ఎంత మంది కొత్త కూతుర్లకు పిల్లలు పుట్టినప్పుడల్లా వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారో.. ఎంతమంది కొత్త కూతుళ్లను పిల్లల సహా తన ఇంటికి పిలిచి ఆశీర్వదించారో.. ఈ గణాంక వివరాలన్నీ కూడా విజయసాయిరెడ్డి చెబితే ప్రజలు నవ్వుకోవడానికి ఇంకాస్త బాగుంటుంది. అయినా తాను చెప్పదలుచుకున్న అబద్ధాలన్నీ చెప్పేసి చివరికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అయినా సరే ఈ మాటలు చెబుతాను అంటూ ముక్తాయించడం విజయసాయి రెడ్డి లాంటి నాయకుడికి మాత్రమే చెల్లింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles