ఎన్బీకే 109 లో చాలా స్పెషల్ గా ఉండబోతున్న అతడి లుక్‌!

Thursday, September 19, 2024

నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇప్పటి తరం హీరోలకు పోటీగా ఉంటూ..తనదైన స్టైల్‌ లో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కొల్లిబాబీ డైరెక్షన్‌ లో బాలయ్య బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇక బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ సెన్సేషనల్ హిట్స్ కొట్టిన బాలయ్య ఈ సినిమా హిట్ తో ఇంకో హ్యాట్రిక్ కి నాంది పలకాలి అని అభిమానులు ఎంతగానో భావిస్తున్నారు. అయితే వారి అంచనాలకి ఏమాత్రం తీసిపోకుండా బాబీ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.

మరి ఈ సినిమాలో బాలయ్యని ఎదుర్కొనే విలన్ గా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం బాబీ డియోల్ కి బాబీ ఒక స్పెషల్ లుక్ ని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. బాబీ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాడు అని అలాగే బాలయ్యకి తనపై సీక్వెన్స్ లు అదిరే లెవెల్లో ఉంటాయని సమాచారం. మొత్తానికి అయితే బాబీ మాత్రం ఓ రేంజ్ లో  సినిమాని తీర్చిదిద్దుతున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles