ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అనూహ్యంగా నమోదు అయింది. ఉదయం పోలింగ్ ప్రారంభం అయినప్పటినుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు బూత్ లకు బార్లు తీరారు. మహిళలు, వృద్ధులు చాలా పెద్దసంఖ్యలో ఓటింగుకు తరలివచ్చారు. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా.. ఎక్కడా ప్రజలు వెనక్కు తగ్గలేదు. నిర్భయంగా వచ్చి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 68 శాతం ఓటింగు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74 శాతం ఓట్లు పడ్డాయి. పోలింగు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్త పోలింగ్ 75 శాతానికి, చిత్తూరు జిల్లాలో 80 శాతానికి చేరవచ్చునని అంచనాలు సాగుతున్నాయి. ఇంత భారీస్థాయిలో ఓటర్లు వెల్లువలా ఓటింగుకు తరలిరావడం అనేది.. ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అనే అంచనాలు సాగుతున్నాయి. ఈ పరిణామాల పట్ల తెలుగుదేశం శిబిరంలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది.
ప్రధానంగా మహిళలు ఎక్కువశాతం ఓటింగుకు తరలిరావడం అనేది తెలుగుదేశానికి గొప్ప ఎడ్వాంటేజీ అని ఆ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు మహిళా సంక్షేమానికి అనేక వినూత్నమైన అద్భుతమైన పథకాలనను ప్రకటించారు. ఆయన ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలోనే .. 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటివి అనేకం ఉన్నాయి. వ్యూహాత్మకంగా చంద్రబాబు చేసిన మరొక మంచి పని ఏంటంటే.. ఈ సూపర్ సిక్స్ హామీలను పోయిన ఏడాది మహానాడులోనే ప్రకటించేశారు. ఏడాది వ్యవధి ఉండడం వలన ఆ హామీలన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. ప్రజలు సహజంగానే ఆ పథకాల పట్ల ఆకర్షితులయ్యారు.
ఆ ఫలితమే ఇవాళ మహిళల ఓటింగు శాతం పెరగడం అనేది విశ్లేషకుల అంచనా. అలాగే.. ఓటింగ్ శాతం 65 కంటె పెరగడం, భారీగా నమోదు కావడం అనేది సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అనేది సార్వజనీనమైన సిద్ధాంతం. గత ఎన్నికల్లో కూడా ఏపీలో 79 శాతం పోల్ అయింది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. ఈసారి కూడా ఇంచుమించుగా 75 శాతం దాటి పోలింగ్ నమోదు అవుతోంది. ఇది కూడా జగన్ ప్రభుత్వం పతనం అవుతుందని అనుకోవడానికి ఒక కారణం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పెరిగిన ఓటింగ్ శాతంపై తెదేపాలో పండగ
Wednesday, January 22, 2025