అరే అఖిల్‌ లా ఉన్నాడే..నిజమేనా?

Sunday, December 8, 2024

అక్కినేని నాగార్జున్‌ వారసుల్లో అక్కినేని అఖిల్‌ ఒకరు. ఆయన కింగ్‌ వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో సినిమాలకు చాలా గ్యాప్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. తాజాగా అఖిల్‌ గురించి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

 అందుకు కారణం సార్‌  న్యూ లుక్కే. ‘ఏజెంట్’ రిజల్ట్ తో బాగా నిరాశ చెందిన అఖిల్ గత కొంతకాలంగా బయట ఎక్కడా కనిపించడం లేదు. ఆ మధ్య ‘సలార్’ సక్సెస్ పార్టీలో మెరిసిన ఈ హీరో తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చి అందరినీ షాక్‌ కి గురి చేశాడు. దీంతో అఖిల్ కొత్త అవతారం చూసి  అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ పిక్ లో అఖిల్ లాంగ్ హెయిర్ తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలీష్ గా ఉన్నాడు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో అఖిల్ కొత్త లుక్ పై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అయితే అఖిల్ తన కొత్త సినిమా కోసం ఈ లుక్ ని మైంటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తో అఖిల్ ఓ మూవీ తెరకెక్కిస్తున్నాడు.  ఇది కంప్లీట్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని ఇంతకుముందే వార్తలు వినిపించాయి. ఇప్పుడు అఖిల్ ఇలా పొడవైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించడంతో పీరియాడికల్ సినిమా కోసమే అఖిల్ ఇలా ఉన్నాడని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles