గతకొంత కాలంగా సెలబ్రిటీల విడాకుల వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉండే చాలా మంది స్టార్లు, చిన్న గొడవలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో జయం రవి జీవితం కూడా ఇలాంటి నిర్ణయంతో వార్తల్లోకి వచ్చాడు. 2009లో ఆర్తి అనే యువతిని జయం రవి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య సుమారు 15 ఏళ్ల పాటు గడిచిన దాంపత్య జీవితం చివరకు విడాకుల వరకు వచ్చింది. దీంతో ఇద్దరూ వేరు కావాలని నిర్ణయించుకున్నారు.
జయం రవి విడాకులకు అంగీకరించడంతో వారి బంధం ముగిసిపోయింది.కానీ కథ ఇక్కడితో ఆగలేదు. విడాకుల తర్వాత ఆర్తి కోర్టును ఆశ్రయించి, జయం రవి తనకు నెలకు నలభై లక్షల రూపాయలు భరణంగా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. అంతటి పెద్ద మొత్తం డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పరిస్థితుల్లో జయం రవి ఏమి చేస్తాడు, తన మాజీ భార్య అడిగినట్టే ఆ మొత్తం చెల్లిస్తాడా, లేదా మరో మార్గం చూస్తాడా అన్నది ప్రస్తుతం అందరికీ కుతూహలంగా మారింది.
