పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ఓజీ మీద ప్రేక్షకుల్లో ఎంతలా క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. పవన్ నుంచి మళ్లీ ఒక పవర్‌పుల్ మాస్ ఎంటర్టైనర్ వస్తోందన్న ఉత్సాహంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఓజీకి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్‌ను అభిమానులు క్యాచ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, పవన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు టీమ్ వెల్లడించింది. ఈ సినిమాలో పవన్ ‘గంభీర’ అనే పవర్‌ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన పార్ట్ పూర్తికావడంతో షూటింగ్ త్వరగా ముగుస్తుందన్న టాక్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇక హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, సంగీతంలో థమన్ తన స్టైల్ మ్యూజిక్‌తో మళ్లీ ఆకట్టుకోనున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఓజీ మూవీకి సంబంధించి మిగతా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
