హవ్వ.. రిటర్నింగ్ అధికారికే బెదిరింపులా?

Wednesday, January 22, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల దందా అంటే అదీ! తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఎలా చెలరేగుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అధికారంలేనప్పుడు.. ఎన్నికల కోడ్ లేనప్పుడు..అది కూడా నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి మీద వారు ఎలా దూకుడు ప్రదర్శిస్తున్నారో అది గమనిస్తే చాలు. వాళ్లెంతటి ‘సౌమ్యులో.. మంచివాళ్లో..’ చటుక్కున అర్థమైపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఏ స్థాయిలో అధికారుల మీదనే జులుం చెలాయిస్తున్నారో.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహారమే పెద్ద ఉదాహరణ.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో వైకాపా అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి, ఒంగోలు పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళా రిటర్నింగ్ అధికారి పట్ల మాట్లాడిన మాటలు, బెదిరించిన తీరు చర్చనీయాంశం అవుతున్నాయి.

‘‘మరీ ఇంత కఠినంగా ఉంటే కష్టం మేడమ్.. మీరే నష్టపోతారు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు. మేం రాజకీయ నాయకులం అని గుర్తుంచుకోవాలి. మా మీద ఇష్టం వచ్చినట్టు ఉల్లంఘన కేసులు పెట్టేస్తున్నారు. మేం ప్రెవేటు కేసులు వేస్తే మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. జాగ్రత్త. కాస్త చూసీ చూడనట్టు వెళ్లండి..’’ ఇదీ చెవిరెడ్డి బెదిరింపు తీరు. ఇంతకూ ఆ మహిళా రిటర్నింగ్ అధికారి చేసిన పాపం ఏమిటో తెలుసా?
అక్కడి అబ్యర్థి చంద్రశేఖర్ మీద ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కేసులు పెట్టడం. ఆయనపై ఇప్పటికి మూడు ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. అలాగే మూడురోజుల కిందట చంద్రశేఖర్ భార్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లినప్పుడు.. మైనర్ అయిన ఆయన కొడుకును లోనికి అనుమతించలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెవిరెడ్డి ఆ అధికారిని ఆస్థాయిలో బెదిరించినట్టుగా తెలుస్తోంది.

సాధారణంగా ఎన్నికల సమయంలో  రిటర్నింగ్ అధికారికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యమంత్రి కాదు కదా.. ప్రధాని వచ్చినా సరే.. రిటర్నింగ్ అధికారి ముందు లోకువే లెక్క. ప్రధాని వచ్చిన అధికారి కుర్చీలోంచి లేవకూడదు. కూర్చునే ఉండాలి. అభ్యర్థి తమ నామినేషన్ ను నిల్చుని వారికి అందించాలి. ఇంతగా ఆర్వో కు అధికారాలు ఉంటాయి. ప్రాధాన్యం ఉంటుంది. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ జమానాలో అంతా తేడానే. ఏకంగా రిటర్నింగ్ అధికారినే మహిళ అనే గౌరవం కూడా లేకుండా.. ‘నీ సంగతి చూస్తా’ అనడం ఒక్కటే తక్కువ.. ఆ స్థాయిలో బెదిరించడం వైసీపీ నాయకులకు మాత్రమే చెల్లిందని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles