టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువ హంగామా క్రియేట్ చేస్తున్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజీ” ముందుంటుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. సినిమా గురించి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచుతోంది.
కానీ ఒక విషయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు “ఓజీ”కి సంబంధించిన ప్రచారం ఎక్కువగా తెలుగు మార్కెట్‌కే పరిమితమైందని చెప్పాలి. మేకర్స్ కూడా ప్రాధాన్యతగా తెలుగు కంటెంట్‌నే విడుదల చేస్తున్నారు. హిందీ, తమిళ్ లాంటి ఇతర భాషల్లో కూడా సమాంతరంగా కంటెంట్ ఇచ్చి ఉంటే మరింత పెద్ద స్థాయిలో హైప్ పెరిగేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే వచ్చిన రెండో పాట “సువ్వి సువ్వి”కు ఇప్పటికే కొన్ని రోజులు గడిచినా, దాని హిందీ, తమిళ్ వెర్షన్లు ఇంకా బయటకు రావడం లేదు. అలాగే ఇమ్రాన్ హష్మీ గ్లింప్స్ టీజర్ కూడా హిందీలో ఒకేసారి రిలీజ్ చేసి ఉండి ఉంటే ఉత్తరాదిలో మంచి బజ్ వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
