ఆ డైరెక్టర్ తో నాని సినిమా ఆగిపోయిందా..? ఎందుకంటే!

Saturday, July 20, 2024

టాలీవుడ్ నేచురల్‌ స్టార్‌ హీరో నాని ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. కొంతకాలం క్రితం వచ్చిన నాని సినిమాలు అన్ని భారీ హిట్  ను సొంతం చేసుకున్నాయి. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. దసరా సినిమాతో యాక్షన్ లో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ తో విజయాన్ని అందుకున్నాడు.

ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది.. అయితే బలగం వేణుతో ఓ సినిమా వస్తుందని గతంలో వార్తలు వినిపించాయి..ఆ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని కూడా పూర్తి అయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రం తాజాగా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మంచి కథ దొరికితే వీరి కాంబో కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించిన ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.

ఇప్పుడు సుజీత్ దర్శకత్వం లో మరొక చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా గురించి త్వరలోనే నాని అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. నాని ప్రస్తుతం తెలుగు డైరెక్టర్స్ మాత్రమే కాదు తమిళ్ డైరెక్టర్స్ కూడా నానితో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జ్ఞానవేల్‌ నానికి సరిపడా ఒక మంచి సబ్జెక్టు తన వద్ద ఉండటంతో ఆయన రజని మూవీ తర్వాత ఇదే చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఈ ఏడాది అక్టోబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్‌.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles